ముందుకు మరింత ముందుకు .. టీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ఇదే

తెలంగాణా అధికార పార్టీ టీఆర్ఎస్ మంచి జోరు మీద ఉంది.అందరికంటే ముందు అంటూ ఎన్నికల వేడి పెంచే ప్రయత్నం చేస్తోంది.

 Kcr To Release Candidates Shortlist 3 Months Early-TeluguStop.com

సభలు సమావేశాలతో అన్ని పార్టీల్లో గుబులు రేపుతోంది.అంతే కాదు సర్వే ఫలితాలు మాకు అనుకూలం అంటూ ప్రజల్లో ఒకరకమైన అభిప్రాయం కలిగించి లాభపడేందుకు చూస్తోంది.

ప్రభుత్వాన్ని కూడా రద్దు చేసి ఎన్నికలకు వెళ్లేందుకు చూస్తున్న టీఆర్ఎస్ ముందస్తుగా తమ పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించేందుకు సిద్ధం అవుతోంది.

తెలంగాణ ప్రభుత్వ రద్దు జరుగుతోంది.ఆతర్వాత రోజే అంటే శ్రావణ శుక్రవారం మంచి రోజు.ఆరోజే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల జాబితా విడుదలవుతుందని తెలుస్తోంది.

మంచి రోజు పన్నెండు నుంచి ఇరవైఐదు పేర్లతో లిస్ట్ వస్తుందనే ఊహగానాలు విన్పిస్తున్నాయి.సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగే ‘ప్రజా ఆశీర్వాద’ సభలో టిఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను టీఆర్ఎస్ అధినేత ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

హుస్నాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌ తో పాటు మరో కొంత మంది అభ్యర్థుల జాబితాను కేసీఆర్ విడుదల చేస్తారని ఓ టాక్ విన్పిస్తోంది.అయితే ఆక్టోబర్ మొదటి వారంలో ఈ జాబితాను కేసీఆర్ విడుదల చేస్తారని మరో వాదన కూడా టీఆర్ఎస్ లో వినిపిస్తోంది.

ఇప్పటికే జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సంజయ్ ను నిజామాబాద్ ఎంపీ కవిత ప్రకటించారు.కామారెడ్డి అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పేరును కేటీఆర్‌ మంగళవారం తెలంగాణభవన్‌లో ప్రకటించారు.

టీఆర్ఎస్ ప్రకటించబోయే అభ్యర్థుల తొలి జాబితా ఇదే అని ఒక లిస్ట్ బయటకి వచ్చింది.దానిప్రకారం చూస్తే…

గజ్వేల్ – కేసీఆర్,
సిద్దిపేట – హరీశ్‌రావు,
హుజూరాబాద్ – ఈటెల రాజేందర్,
బాన్సువాడ – పోచారం శ్రీనివాస్‌రెడ్డి లేదా ఆయన కొడుకు
ఆదిలాబాద్ – జోగు రామన్న
ధర్మపురి – కొప్పుల ఈశ్వర్,
కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు
తాండూర్ – పి.మహేందర్‌రెడ్డి
వరంగల్ (వెన్ట్) – దాస్యం వినయ్ భాస్కర్
కరీంనగర్ – గంగుల కమలాకర్
కామారెడ్డి – గంప గోవర్ధన్
సిరిసిల్ల – కే.టీ.ఆర్
సికింద్రాబాద్ – టి.పద్మారావు
సూర్యాపేట – జగదీశ్వర్ రెడ్డి
మహబూబ్ నగర్ – వి.శ్రీనివాస్ గౌడ్
వనపర్తి – నిరంజన్ రెడ్డి
బాల్కొండ – వి.ప్రశాంత్ రెడ్డి
దేవరకద్ర – ఎ.వెంకటేశ్వరరెడ్డి
హుస్నాబాద్ – వి.సతీష్ కుమార్
గద్వాల – కృష్ణమోహన్ రెడ్డి
నకిరేకల్ – వేముల వీరేశం
మెదక్ – పద్మాదేవేందర్ రెడ్డి
వర్ధన్నపేట – ఆర్రూరి రమేశ్
నాగర్ కర్నూల్ – మర్రి జనార్ధన్ రెడ్డి
ఆర్మూర్ – ఏ.జీవన్ రెడ్డి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube