నిండా మునిగిన కుర్రహీరో.. మరో సాహసం చేయగలడా..

చిన్న చిత్రాలతో హీరోగా గుర్తింపు దక్కించుకుని ఒకటి రెండు సక్సెస్‌లను దక్కించుకున్న నాగశౌర్య ఆమద్య ‘ఛలో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ చిత్రంను నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి నిర్మించారు.

 Hero Naga Shourya Wants To Do Another Experiment-TeluguStop.com

కొడుకుపై అభిమానంతో ఏకంగా 10 కోట్ల బడ్జెట్‌తో ఆ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.నాగశౌర్య మార్కెట్‌ దృష్ట్యా రెండు మూడు కోట్ల కంటే ఎక్కువ పెడితే రిష్కీ ప్రాజెక్ట్‌.

అయినా కూడా 10 కోట్లు ఖర్చు చేసి ఛలో చిత్రాన్ని అతడి తల్లి నిర్మించింది.ఛలో ఫలితం ఏంటో అందరికి తెల్సిందే.

అదృష్టం కొద్ది ఛలో చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది.10 కోట్ల బడ్జెట్‌ రికవరీ చేయడంతో పాటు రెండు కోట్ల మేరకు లాభాలు కూడా తెచ్చి పెట్టినట్లుగా సమాచారం అందుతుంది.ఇలాంటి సమయంలోనే నాగశౌర్య మరో ప్రయత్నం చేశాడు.ఈసారి కూడా తన తల్లి నిర్మాణంలో ‘నర్తనశాల’ అనే చిత్రాన్ని చేసి చేతులు కాల్చుకున్నాడు.భారీ బడ్జెట్‌తో నర్తనశాలను తెరకెక్కించడం జరిగింది.ఛలో చిత్రం తరహాలోనే ఈ చిత్రం కూడా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఈ చిత్రంపై అంచనాలు పెట్టుకున్నారు.

‘నర్తనశాల’ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది.ప్రేక్షకులు సినిమాను తిరష్కరించడంతో తీవ్ర నష్టాలు తప్పవని తేలిపోయింది.ఛలో చిత్రంతో పర్వాలేదు అన్నట్లుగా అనిపించుకున్న నాగశౌర్య నర్తనశాల చిత్రంతో దాదాపు ఏడు కోట్ల మేరకు నష్టంను చవిచూడాల్సి వచ్చే అవకాశం ఉంది.నాగశౌర్య బడ్జెట్‌ పరిమితి రెండు కోట్లు.

కాని ఉషా 10 కోట్లకు మించి నిర్మించిన కారణంగా భారీ నష్టాలు తప్పవని సినీ వర్గాల వారు అంటున్నారు.

సినిమాకు విపరీతంగా ప్రమోషన్‌ను నిర్వహించిన చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంలో విఫలం అయ్యారు.దాంతో సినిమా నిర్మాతకు భారీగా నష్టాలను మిగల్చడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.ఇక ఈ చిత్రం తర్వాత అయినా నాగశౌర్య కాస్త జాగ్రత్త పడతాడా అనేది చూడాలి.

నాగశౌర్య ఈ చిత్రం తర్వాత చేయబోతున్న చిత్రానికి పరిమితి స్థాయిలో బడ్జెట్‌తో చేయాలని, లేదంటే మళ్లీ చిక్కులో పడ్డాల్సి వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube