జూనియర్ ఎన్టీఆర్ ను 'సీనియర్ 'ఎన్టీఆర్' దగ్గరికి 'హరికృష్ణ' తీసుకెళ్లినప్పుడు జరిగిన ఆసక్తికర సంఘటన ఇదే.!

హరికృష్ణ గారికి అటు తండ్రిపై ఎంత గౌరవం ఉందొ.ఇటు కొడుకుపై కూడా అంతే ప్రేమ ఉంది.

 Junior Ntr With Senior Ntr-TeluguStop.com

గతంలో ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో వేడుకలో హరికృష్ణ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.ఆ సభలో ఆయన మాట్లాడుతూ ‘‘నా పెద్ద కుమారుడి పేరు జానకీరామ్‌.

రెండో బిడ్డ కల్యాణ్‌రామ్‌.ఈ రెండు పేర్లూ మా నాన్నగారు పెట్టినవి.ఎందుకంటే… మా అన్నదమ్ములు ఏడుగురికి కృష్ణలు పెట్టడం అయ్యింది.మాకు నలుగురు అక్కచెళ్లల్లు.

వాళ్లందిరికీ ‘ఈశ్వరి’ వచ్చేలా పేర్లు పెట్టారు.నా బిడ్డల తరం వచ్చినప్పుడు నాన్నగారి దగ్గరకు వెళ్లి… మీరే పేరు పెట్టాలని అడిగా.

“తరం మారింది నాన్నా! ఇప్పుడు జాన్‌… అంటూ ఏవేవో కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి.మీ ఇష్టం” అన్నారు.

నేను “లేదు.మీరే పేరు పెట్టాలి’ అన్నాను.పెద్దవాళ్లు ఇద్దరికీ ఆయనే పేర్లు పెట్టారు.జూనియర్‌ బాబు (చిన్న ఎన్టీఆర్‌)కి మాత్రం ముందు నేనే పెట్టా.

తారకరామ్‌ అని! ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రీకరణ సమయంలో నాన్నగారు ‘ఏం చేస్తున్నాడు మూడోవాడు.ఒకసారి తీసుకురా!’ అన్నారు.

తీసుకువెళ్లా.‘నీ పేరేమిటి?’ అని బాబుని అడిగారు.

‘తాతగారూ… నా పేరు తారకరామ్‌.డాడీ పెట్టారు’ అని చెప్పాడు.వెంటనే ‘నో! నీది నా అంశ.నా పేరు నీకుండాలి’ అన్నారు.నా మూడో అబ్బాయికి నందమూరి తారకరామారావు అని పేరు పెట్టి, ఆయన పేరుని ఆయనే దానం చేశారు.ప్రేక్షకులకి తెలియని మరో విషయం ఏంటంటే… ‘విశ్వామిత్ర’ హిందీ వెర్షన్‌లో జూనియర్‌ బాబు భరతుడి వేషం వేశాడు.

తన తాతగారితో కలిసి నటించాడు’’.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube