అయ్యో.. గోవిందం గురించి దర్శకేంద్రుడు ఇంత మాటన్నాడేంటి

విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకుంది.ఈ చిత్రం గురించి ప్రేక్షకులు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడా గొప్పగా మాట్లాడుతున్నారు.

 K Raghavendra Rao Comments On Geetha Govindam Movie-TeluguStop.com

తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మాట్లాడుతూ ఈ చిత్రం తాను 20 ఏళ్ల క్రితం తెరకెక్కించిన ‘పెళ్లి సందడి’ చిత్రానికి కాపీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.దర్శకేంద్రుడి వ్యాఖ్యలు కాస్త విడ్డూరంను కలిగించేలా ఉన్నా కూడా ఆయన ఆ మాటలను కామెడీగా అన్నాడు.

దర్శకేంద్రడు పెళ్లి సందడిని గీత గోవిందం చిత్రంతో పోల్చిన సందర్బంగా కాపీ అనే పదంను వాడారు.అప్పట్లో పెళ్లి సందడి చిత్రాన్ని చిన్న బడ్జెట్‌తో నిర్మించడం జరిగింది.చిన్న చిత్రంగా నిర్మాణం జరిగిన పెళ్లి సందడి భారీగా విజయాన్ని దక్కించుకుని మంచి వసూళ్లను రాబట్టింది.ఇప్పుడు అదే మాధిరిగా గీత గోవిందం చిత్రం కూడా పెళ్లి సందడి మాదిరిగా సంచలన విజయాన్ని నమోదు చేసిందని దర్శకేంద్రుడు చెప్పుకొచ్చాడు.

భారీ అంచనాలు లేకుండా విడుదలైన గీత గోవిందం చిత్రం అన్ని వర్గాల వారిని అరిస్తూ ముందుకు వెళ్తుంది.

గీత గోవిందం చిత్రంను అల్లు అరవింద్‌ నిర్మించాడు.

అప్పట్లో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో పెళ్లి సందడి చిత్రాన్ని కూడా అశ్వినీదత్‌తో కలిసి అల్లు అరవింద్‌ నిర్మించాడు.నిర్మాణం విషయంలో కూడా పెళ్లి సందడి మరియు గీత గోవిందం చిత్రాలు పోలికలను కలిగి ఉన్నాయి.

ఇక ఈ రెండు చిత్రాలు కూడా పెళ్లి నేపథ్యంలో తెరకెక్కినవి కావడం వల్ల కూడా రాఘవేంద్ర రావు గీత గోవిందంను తన సినిమాకు కాపీ అన్నాడు అని చెప్పుకోవచ్చు.

తెలుగు సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్రం వసూళ్లను సాధిస్తుంది.చిన్న బడ్జెట్‌ చిత్రాల్లో బాహుబలి స్థాయి విజయాన్ని ఈ చిత్రం అందుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ స్టార్‌లకే స్టార్‌ అయ్యాడు.

ఇక దర్శకుడు పరుశురామ్‌ కూడా భారీగా క్రేజ్‌ను దక్కించుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube