పంతొమ్మిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా నీటిని వాడుకుంటున్నారు..ఇది ఎలా సాధ్యమైందో తెలుసా..

భూగ‌ర్భ జ‌లాలు ఎండిపోవ‌డం.వ‌ర్షాలు స‌రిగ్గా ప‌డ‌క‌పోవ‌డం వల్ల నీటి సమస్య తీవ్రత రోజురోజుకి ఎలా పెరుగుతుందో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.

 Bengaluru Man Hasnt Paid Water Bill In 22 Years-TeluguStop.com

ప్ర‌స్తుతం చాలా చోట్ల తాగునీరే కాదు, నిత్యం అవ‌స‌రాల కోసం వాడే నీటిని కూడా కొనుగోలు చేయాల్సి వ‌స్తోంది.కానీ బెంగుళూరు చెందిన ఒక వ్య‌క్తి మాత్రం గ‌త 19 సంవ‌త్స‌రాలుగా నీటి కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించ‌లేదు.

అవును, మీరు విన్నది నిజ‌మే.నీటికి అత్యంత స‌మ‌స్య‌గా ఉండే బెంగుళూరు న‌గ‌రంలో ఒక్క రూపాయి కూడా చెల్లించ‌కుండా ఇన్నేళ్ల పాటు నీటిని వినియోగించుకుంటూ ఉన్నాడంటే.

నిజంగా చాలా గ్రేట్.అతని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆయ‌న పేరు ఏఆర్ శివ‌కుమార్‌.క‌ర్ణాట‌క రాష్ట్రంలోని బెంగుళూరులో నివాసం ఉంటున్నారు.ఆయ‌న Karnataka State Council for Science and Technology (KSCST) లో principal investigator for rainwater harvesting (RWH) గా ప‌నిచేస్తున్నారు.

అయితే గ‌త 19 సంవ‌త్స‌రాల నుంచి ఆ న‌గరంలో ఆయ‌న ఉంటున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ నీటికి ఒక్క‌రూపాయి కూడా చెల్లించ‌లేదు.బెంగుళూరులో నీటికి అత్యంత క్లిష్ట ప‌రిస్థితులు నెల‌కొన్న స‌మ‌యంలోనూ ఆయ‌న నీటికి ఒక్క రూపాయి చెల్లించకుండా వాడుతున్నారు, అంతేకాక ఆయ‌న ఇంట్లో పుష్క‌లంగా నీరు ఉంది.

ఇది ఎలా సాధ్య‌మైందంటే… వాన నీటిని ఒడిసి ప‌ట్ట‌డం వ‌ల్లే.

శివ‌కుమార్ చిన్న‌త‌నంలో ఆయ‌న త‌న సోద‌రితో క‌లిసి నీటి కోసం మైళ్ల దూరం న‌డిచి వెళ్లేవారు.

అయితే ఆయ‌న అప్పుడే అనుకున్నారు.ఎప్పుడైనా ఇల్లు క‌ట్టుకుంటే అందులో నీరు మాత్రం ఎప్ప‌టికీ పుష్క‌లంగా ఉండాల్సిందేన‌ని.

దీని కోసం ఆయ‌న ఎంత‌గానో శ్ర‌మించారు.స్ట‌డీ చేశారు కూడా.

చివ‌ర‌కు 19 ఏళ్ల క్రితం బెంగుళూరులో ఇంటిని క‌ట్టే స‌మ‌యంలో ముందుగానే అండ‌ర్‌గ్రౌండ్‌లో సుమారు 40వేల లీట‌ర్ల నీరు ప‌ట్టే పెద్ద వాట‌ర్ ట్యాంక్‌ను నిర్మింప‌జేశారు.దానిపై ఇల్లు క‌ట్టారు.

ఇంటిపై మ‌రో 4,500 లీట‌ర్ల నీరు ప‌ట్టే ట్యాంక్‌ల‌ను నిర్మించారు.దీంతో వ‌ర్షం ప‌డిన‌ప్పుడు ఇంటి పైన ఉండే ట్యాంకుల ద్వారా ఆ నీరు ఇంటి కింద ఉన్న అండ‌ర్‌గ్రౌండ్ ట్యాంక్‌లోకి వ‌చ్చి చేరేది.

దీంతో ఆ ట్యాంక్ నిండేది.అలా నిండిన ట్యాంక్‌లో ఉన్న నీటిని శివ‌కుమార్ కుటుంబ స‌భ్యులు ఉపయోగించుకుంటారు.

దీంతో ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు గత 19 ఏళ్ల‌లో నీటి కోసం ఎన్న‌డూ ఇబ్బంది ప‌డ‌లేదు.అందుకోసం ఒక్క రూపాయి కూడా చెల్లించ‌లేదు.

సాధార‌ణంగా ఏ ఇంట్లో అయినా స‌హ‌జంగా రోజుకు 400 లీట‌ర్ల వ‌ర‌కు నీరు అవ‌స‌రం అవుతుంది.దాన్ని 100తో గుణిస్తే 400 x 100 = 40000 అవుతుంది.అంటే వ‌ర్షం 3 నెల‌ల‌కు ఒక‌సారి ప‌డుతుంద‌నుకున్నా 3 x 30 = 90.అంటే.దాదాపుగా 100 రోజుల వ‌ర‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా అలా స్టోర్ అయిన నీటిని భేషుగ్గా వాడుకోవ‌చ్చు.

ఈ 100 రోజుల్లోనూ ఎప్పుడు వ‌ర్షం ప‌డ్డా ట్యాంక్ నిండుతుంది క‌నుక సంవ‌త్స‌రం మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓ సాధార‌ణ కుటుంబం ఇలా వ‌ర్ష‌పు నీటిని స్టోర్ చేసుకుని వాడువ‌కోచ్చు.ఇదే ఐడియా ఆలోచించాడు కాబ‌ట్టే శివ‌కుమార్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు నీటికి డ‌బ్బు చెల్లించే అవ‌స‌రం రాలేదు.

కేవ‌లం ఇదే కాదు, ఆయ‌న త‌న ఇంట్లో సోలార్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేశాడు.దీంతో ఆయ‌న‌కు క‌రెంటు బిల్లు కూడా పెద్ద రావ‌డం లేదు.నామ మాత్ర‌పు బిల్లునే ఆయ‌న క‌డుతున్నారు.అవును మ‌రి… ఇప్ప‌టికీ ఆయ‌న ఒక్క‌టే అంటారు… ఏ ఇంట్లో అయినా నివాసం ఉండాలంటే ఆ కుటుంబ స‌భ్యులకు 3 విష‌యాల ప‌ట్ల క‌చ్చిత‌మైన అవ‌గాహ‌న ఉండాల‌ని.

అవి… శ‌క్తి… నీరు… గాలి.! ఇవి ఎంత పుష్క‌లంగా ఉంటే ఆ ఇంట్లో కుటుంబ స‌భ్యులు అంత సౌక‌ర్య‌వంతంగా ఉంటార‌ని అంటారాయ‌న‌.

శివకుమార్ చెప్పేది కూడా నిజమే కదా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube