ప్రపంచంలో ఉన్న మనుషులందరిలో ఒకే రకమైన తెలివిని కలిగి ఉండరు.కొందరికి అమితమైన తెలివితేటలుంటే,మరికొందరు తెలివితక్కువ వారు కూడా ఉంటారు.
వీరితోపాటు తెలివి అస్సలు లేని వారూ ఉంటారు.అయితే తెలివితేటలనేవి కొందరికి పుట్టుకతోనే వస్తాయి…మరికొందరికి అవి పెరుగుతున్న కొద్దీ వస్తాయి.
ఇక తెలివి తేటల విషయంలో ఎవరు ఎలా ఉన్నా ఇతర సమయాల్లో పుట్టిన వారి కంటే రాత్రి పూట పుట్టినవారు ఎక్కువ తెలివి తేటలను కలిగి ఉంటారట తెలుసా.ఇది మేం చెప్తున్నది కాదు ,శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఇటీవల కొన్ని అధ్యయనాల్లో తేలిన నిజం.
యూనివర్సిటీ ఆఫ్ మాడ్రిడ్‌కు చెందిన పలువురు సైంటిస్టులు కొందరిపై ప్రయోగాలు చేశారు.వ్యక్తులను వారు పుట్టిన సమయాలను అడిగి తెలుసుకున్నారు.దీంతోపాటు వారి విజ్ఞానం, చదువు, తెలివితేటలు, ఐక్యూ స్థాయిలను కూడా పరిశీలించారు.
దీంతో వారు చివరికి ఓ విషయం తేల్చేశారు.అదేమిటంటే… రోజులో మిగతా సమయాల్లో కన్నా రాత్రి పూట పుట్టిన వారే ఎక్కువ తెలివిమంతులు అవుతారట.
వారికే ఐక్యూ ఎక్కువగా ఉంటుందట.దీంతోపాటు పలు ఇతర విషయాలను కూడా ఆ సైంటిస్టులు వెల్లడించారు.
రాత్రి పూట పుట్టిన వారికి తెలివి తేటలే కాదు, సమస్యలను పరిష్కరించే సత్తా కూడా ఉంటుందట.వీరు చదువుల్లో ఎక్కువగా రాణిస్తారట.గొప్ప ఉద్యోగాలు చేస్తారట.సాధారణంగా ఎవరికైనా రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర కావాలి కదా.అయితే రాత్రి పూట పుట్టిన వారికి మాత్రం కేవలం 5 నుంచి 6 గంటల నిద్ర ఉన్నా సరిపోతుందట.వీరికి ఎక్కువ నిద్ర అవసరం ఉండదట.
పనిలో బాగా చురుగ్గా ఉంటారట.ఎక్కువ పని చేస్తారట.
అదీ విషయం.