కండోమ్ లను పర్సుల్లో,బాత్రూంలలో దాచిపెడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తెలుసుకోవాలి..

మన ఆరోగ్య భద్రతకోసమే అయినా కండోమ్ అనే పదం వాడాలన్నా,అవి వాడుతున్నాం అనే మాట చెప్పడానికైనా చాలామంది సిగ్గుపడుతుంటారు.రోజురోజుకి పెరుగుతున్న రకరకాల వ్యాధుల దృష్ట్యా మరే ఇతర కారణాల చేత అయినా కండోమ్స్ వాడుతుంటారు.

 Why You Should Never Store In Your Wallet Or Bathroom-TeluguStop.com

కాని ఆ కండోమ్స్ ని ఇతరులు చూడకూడదు అనే తాపత్రయంలో ఎక్కడపడితే అక్కడ దాచేస్తుంటారు.వాటి వలన కూడా నష్టాలున్నాయట తెలుసా.

కండోమ్‌లు కొంటున్నారా.? వాటిని ఎక్కడ దాచి పెడుతున్నారు.? చాలా మందికి కండోమ్‌లను పర్సుల్లో లేదా ప్యాంట్ జేబుల్లో దాచుకోవడం అలవాటు.కానీ ఇలా చేయడం సరికాదని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

వేడి, తేమ, రాపిడి, వెలుతురు లాంటి పరిస్థితులు కండోమ్ నాణ్యతను దెబ్బతీస్తాయట.ఇలాంటి పరిస్థితుల వల్ల అవి ఎఫెక్టివ్‌గా పని చేయకుండా పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

వాలెట్లు, పాకెట్లలో వేడి ఎక్కువగా ఉంటుంది.వేడి పెరిగే కొద్దీ కండోమ్‌లలోని లాటెక్స్ వీక్ అవుతుంది.

దీంతో అవి పాడయ్యే అవకాశం ఉంది.అంతే కాదు ప్యాకెట్లలో బైక్ కీస్ లాంటి పదునైన వస్తువులు ఏవైనా ఉంటే.

కండోమ్‌లు చిరిగిపోయే ప్రమాదం ఉంది.అలాంటి వాటిని వాడటం వల్ల సుఖ వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోలేం.

ఇంకొంతమంది బాత్రూంలో, కిటికీల్లోనూ ఉంచి ,అవసరం ఉన్నప్పుడు తీసి ఉపయోగిస్తుంటారు.తేమ, వేడి, సూర్యరశ్మి కారణంగా అవి పాడయ్యే ప్రమాదం ఉంది.అంతేకాదు బాత్రూంలలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా నుండి కూడా ప్రమాదం ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube