ఆ వెనకబడ్డ జిల్లాలు వైసీపీని ముందుకు తీసుకెళ్తాయా ...

రాజకీయ మనుగడ కోసం తహతహలాడుతున్న వైసీపీకి రాబోయే ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం ఎందుకంటే … ఈ ఎన్నికల్లో గెలవకపోతే ఇక ఆ పార్టీ పూర్తిగా బలహీనపడిపోవడమే కాదు కోలుకోవడం కూడా కష్టం.అందుకే తన శాయశక్తులా జగన్ గెలుపు బాటలు వేసుకుంటున్నాడు.

 What Is The Position In Uttarandhra Of Ys Jagans Ycp-TeluguStop.com

ఒక వైపు పాదయాత్ర చేస్తూనే మరో వైపు పార్టీ పటిష్టతపై దృష్టిపట్టాడు.ఇప్పటికే గోదావరి జిల్లాల్లో పార్టీ కొంచెం దెబ్బతినడంతో ఇక పూర్తి ఆశలన్నీ ఉత్తరాంధ్రపై పెట్టుకున్నాడు.

ప్రస్తుతం జగన్ యాత్ర కూడా అక్కడే సాగుతోంది.

గత ఎన్నికల్లో వైసీపీకి ఉత్తరాంధ్రలో పెద్దగా సీట్లు దక్కలేదు.ఇక అప్పటి నుండి ఉత్తరాంధ్రలో బలపడాలని వైసిపి చాలా ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే పది జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసుకున్న తర్వాత జగన్ తాజాగా విశాఖపట్నంలోకి అడుగుపెట్టటం ద్వారా ఉత్తరాంధ్రలోకి ప్రవేశించారు.

విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రస్తుతం మూడు రోజులుగా జగన్ పర్యటిస్తున్నారు.నర్సీపట్నంలో అడుగుపెట్టిన జగన్ కు ఊహించని రేంజ్ లో స్పందన వచ్చింది.టీడీపీ కొంచుకోటలా ఉంటూ వస్తున్న ఈ నియోజకవర్గంలో జగన్ కు ఊహించని రీతిలో ఆదరణ రావడం వైసీపీలో ఆత్మస్థైర్యాన్ని నింపింది.

గత ఎన్నికల్లో వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం బాగా దెబ్బతింది.

ఈ మూడు జిల్లాల్లో కలిపి వైసిపికి వచ్చింది తొమ్మిది ఎమ్యెల్యే స్ధానాలు మాత్రమే.మూడు జిల్లాల్లోనూ వైసిపి మూడు మూడు చొప్పున నియోజకవర్గాలు గెలిచింది.

ఇక్కడ మొత్తం 34 నియోజకవర్గాలు ఉండగా తొమ్మిది మాత్రమే గెలవడం వైసీపీ పతనానికి మరో కారణం అయ్యింది.అందుకే .వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మెజారిటీ సీట్లు గెలుచుకునే ఉద్దేశ్యంతోనే జగన్ ప్రత్యేకంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు.

ఇప్పటికే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖలో ఎక్కువగా ఉంటూ పార్టీ పటిష్టతపై దృష్టిపెట్టాడు.నాలుగేళ్ళుగా చంద్రబాబునాయుడు పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో విజయసాయి బాగా యాక్టివ్ గా పాల్గొంటున్నారు.టిడిపికి వ్యతిరేకంగా ఆందోళనలతో జనాలను బాగానే కదిలించగలిగింది వైసిపి.ఇప్పుడు కూడా ఉత్తరాంధ్రలో వైసిపి బలహీనంగానే కనబడుతోంది.15 నియోజకవర్గాల్లో మాత్రమే వైసిపికి గట్టి అభ్యర్ధులున్నారని సమాచారం.మిగిలిన 19 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధుల కోసం ఇంకా వెతుకులాట జరుగుతూనే ఉంది.జగన్ ఆశిస్తున్నట్లు మెజారిటీ సీట్లు దక్కాలంటే అన్నీ నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను పోటీలోకి దింపటం ఒకటే జగన్ కు కనిపిస్తున్న మార్గం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube