ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే.... పేరడీ.. సోషల్ మీడియాలో వైరల్...

గీతగోవిందం సినిమాలో ఇంకేంఇంకేం ఇంకేం కావాలే సాంగ్ ఇటీవల ఎంత హిట్ అయిందో అందరికి తెలుసు.అదే సినిమాలో విజయ్ దేవరకొండ పాడిన మరో పాట కూడా పబ్లిసిటి తెచ్చుకుంది.

 Geetha Govindam Inkem Inkem Kavale Spoof Song-TeluguStop.com

కాని ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే పాజిటివ్ గా హిట్ కొడితే విజయ్ పాడిన పాట నెగటివ్ పబ్లిసిటి తెచ్చుకుంది.అప్పుడు విజయ్ పై వచ్చిన ట్రోల్స్ అన్ని ఇన్ని కావు.

వాటన్నింటిని స్పోర్టివ్ గా తీసుకున్న విజయ్ తర్వాత ఆ సినిమాలో తను పాడిన పాట తీసేయించి మరో సింగర్ చేత పాడించారు.ఇంకెప్పుడు పాట పాడకూడదనే డెసిషన్ కూడా తీసుకున్నారు.

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే సాంగ్ మాత్రం ఎవరి కాలర్ ట్యూన్ విన్నా అదే మోగిపోయేది.అలాంటి పాటకి పేరడిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది మరోపాట.అయితే ప్రేయసి గీతని ఉద్దేశించి గోవింద్ పాడితే,గయ్యాళి పెళ్లాన్ని ఉద్దేశించి మన పేరడి సింగర్ పాడారు.పెళ్లాన్ని అవమానించారంటూ ఫెమినిస్టులు విమర్శించినా.ఈ పేరడి మాత్రం సోషల్ మీడియలో మార్మోగిపోతుంది.ఇంటికింటికి ఇంటికెళ్లాలే…ఇంట్లో గయ్యాలే అంటూ సాగే పాటపై మీరూ ఓ లుక్కేయండి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube