అప్పుడే మొదలెట్టేసారు..జనసేనలో అసంతృప్తి రాగం

ప్రశ్నించే స్థాయి నుంచి పీఠమెక్కే స్థాయికి చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాడు.ముందు ఎదో ఒక పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందని అంతా భావించగా పవన్ మాత్రం ఒకడుగు ముందుకు వేసి ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగలనుకుంటున్నట్టు .

 Pawan Kalyan Discard About Members In Janasena Party-TeluguStop.com

మొత్తం ఏపీలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధం అంటూ ప్రకటించాడు.అందుకు అనుగుణంగానే పార్టీలోకి నాయకులను ఆహ్వానించడమే కాకుండా ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం అయ్యేందుకు జిల్లా కన్వీనర్ల పదవులు కూడా భర్తీ చేస్తూ వస్తున్నాడు.

సరిగ్గా ఈ పంపకాలే పార్టీలో అలజడి రేపుతున్నాయి.

కలిసికట్టుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేతల్లో ఈ పదవుల కారణంగా ఒక్కసారిగా చీలికలు మొదలయ్యాయనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి.దీంతో పార్టీలో అలజడి మొదలయ్యింది.అందుకు కారణం కూడా లేకపోలేదు.
ఇటీవల పవన్.పార్టీలో ఏడు జిల్లాలకు కన్వీనర్లను నియమించిన సంగతి తెలసిందే.ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు సహా ఉభయ గోదావరులు, కృష్ణా, గుంటూరు జిల్లాలకు కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లను ప్రటించారు.రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు త్వరలో ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు.

అయితే పార్టీ పదవులు ప్రకటించిన జిల్లాలలో స్థానిక ముఖ్యనేతలు అసంతృప్తిగా ఉన్నారట.మొదటి నుంచి పార్టీకీ సేవలు అందిస్తున్నా చివరకు తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాతమను కాదని కార్పొరేట్ వ్యక్తులకు, వ్యాపారులకు పదవులు దక్కాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాలుగేళ్లుగా జనసేనలో కీలకంగా వ్యవహరించిన తమను కాదని ప్రజారాజ్యంలో పనిచేసిన వారికే పదవులు కట్టబెడుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.కులాల ప్రస్తావన లేని సమాజ నిర్మాణమే ధ్యేయమని చెప్తోన్న పవన్‌కల్యాణ్ ఒకే సామాజికవర్గానికి చెందినవారికి పార్టీ పదవుల్లో పెద్దపీట వేస్తున్నారని విమర్శలు కూడా చేసే స్థాయికి వెళ్లిపోయారు.ఇప్పటికే పార్టీలో మెజార్టీ పదవులన్నీ అధినేత సామజిక వర్గానికే వెళ్లిపోయాయని ఇక మిగతావారి గురించి పట్టించుకోరా అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube