దొంగతనం కేసులో టాలీవుడ్ హీరో అరెస్ట్.! సినిమా ప్లాప్ అవ్వడంతో..అప్పులు తీర్చడానికి.!

సినిమా అంటేనే రంగుల ప్రపంచం.ఇక్కడికి తమ కలలు సాకారం చేసుకునేందుకు చాలా మంది ఆరాటపడుతుంటారు.

 Tollywood Hero Arrested In Robbery Case-TeluguStop.com

కానీ అందరికీ సాధ్యం కాదు.ఎంతో కష్టపడి సినిమాలు తీసిన వారు కూడా అవి ఆడక నిండా మునుగుతారు.

సినిమాల్లో రాణించాలనే కోరికతో ఓ సినిమాని కూడా తెరకెక్కించారు.కానీ అది అనుకున్నంత గుర్తింపు రాలేదు.

దీంతో అప్పులపాలయ్యాడు.ఆ అప్పుల బాధ నుంచి బయటపడేందుకు దొంగ అవతారం ఎత్తాడు.

ఇదేదో సినిమా కథ కాదు.నిజ జీవితంలో ఓ సినీ నటుడు దొంగగా మారాడు.

చివరకు పోలీసులకు చిక్కాడు.వివరాల లోకి వెళ్తే.

కుషాయిగూడ జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన మహేష్‌ సినిమా పిచ్చితో ‘నివురు’ సినిమాను సొంత డబ్బులతో నిర్మించి తనే హీరోగా నటించాడు.ఈ మూవీ వల్ల నష్టాలు మిగలడంతో అప్పులు తీర్చడానికి దొంగతనాలను ఎంచుకున్నాడు.నగరంలో సంపన్నులుండే కాలనీల్లో తిరుగుతూ పగలు రెక్కీ నిర్వహించే వాడు.తాను కేబుల్‌ ఆపరేటర్‌గా చెప్పుకుంటూ తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసేవాడు.రాత్రివేళల్లో ఆయా ఇళ్లల్లో చోరీలు చేసేవాడు.ఇలా తస్కరించిన సొమ్మును మహేష్‌కు తెచ్చివ్వగా అతడు విక్రయించి వచ్చిన డబ్బును ఇద్దరూ పంచుకుని జల్సాలు చేయడంతో పాటు అప్పులు తీరుస్తూ వచ్చారు.

విక్కీ 2016లో జూబ్లీహిల్స్‌ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు.జైలు నుంచి విడుదలైన తరువాత కూడా చోరీలకు పాల్పడుతున్నాడు.అప్పులు తీర్చడానికి, తన జల్సాల కోసం విక్కీతో మహేష్ చేతులు కలిపాడు.హబ్సిగూడ ప్రాంతంలో దొంగతానికి రెక్కీ నిర్వహిస్తుండగా పోలీసులకు అనుమానం వచ్చింది.విక్కి మహేష్ లను ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ఈ దొంగతనాల డొంక కదిలింది.వీరి నుంచి 15 లక్షల విలువైన 50 తులాల బంగారం – 30 తులాల వెండి – రూ3వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube