కాంగ్రెస్ బలపడుతోందా ..? కేసీఆర్ భయం అదేనా ...?

ఇంతకాలం నిస్తేజంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ఈ మధ్యకాలం లో బాగా పుంజుకోవడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ లో ఆందోళన పెరిగిపోతోంది.సాధారణ ఎన్నికల సమయం వరకు ఎన్నికలకు వెళ్లకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ మరింత బలపడి టీఆర్ఎస్ హవాకు ఎక్కడ బ్రేకులు వేస్తుందో అన్న భయం ఇప్పుడు కేసీఆర్ లో స్పష్టం గా కనిపిస్తోంది.

 Cm Kcr Fears With Rahul Gandhi Telangana Tour-TeluguStop.com

అనుకూ ముందస్తు ఎన్నికల కోసం చాలా కంగారు పడుతున్నాడు.తాజాగా చేయించిన సర్వేలో కూడా కాంగ్రెస్ బలపడుతున్నట్టు రిపోర్ట్ లు రావడంతో కేసీఆర్ అప్రమత్తం అయ్యాడు.

అందుకే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాలని కేసీఆర్ భావిస్తున్నారు.పార్లమెంటుతో పాటు జరిగే ఎన్నికల కన్నా, కొంత ముందుగా వెళితే టీఆర్ఎస్ కు లాభం చేకూరుతుందని ఆయన అంచనా.

దీనిలో భాగంగానే సెప్టెంటరులో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పకనే చెప్పారు.సెప్టంబరు లో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్నది కేసీఆర్ ఆలోచన.సెప్టెంబరు 2న హైదరాబాద్ ప్రగతి నివేదన సభ పేరిట భారీ బహిరంగ సభను టీఆర్ఎస్ ఏర్పాటు చేయబోతోంది.

దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవానాలు వీస్తుండడం, అదే సమయంలో కాంగ్రెస్ కొంత పుంజుకోవడం కేసీఆర్ కు ఆందోళన కారణం.రాష్ట్రంలో ప్రధాన శత్రువైన కాంగ్రెస్ పార్టీ బలపడక ముందే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి, అందులో విజయం సాధిస్తే పార్లమెంటు స్థానాలను సులువుగాగెలుచుకోవచ్చని కేసీఆర్ ఆలోచన.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినప్పుడు కూడా కేసీఆర్ తమ రాష్ట్ర ఎన్నికలు మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ ఎన్నికలతో పాటే జరపాలని కోరినట్లు చెబుతున్నారు.

అందుకు ప్రధాని కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.అక్కడి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేయడంతో ఇప్పుడు అభ్యర్థుల సెలక్షన్ లిస్ట్ పై కేసీఆర్ దృష్టిసారించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube