మాజీ లోక్ సభ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ మృతి.! అంత్యక్రియలు ఉండవు, ఎందుకంటే.?

లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమ్‌నాథ్‌ చటర్జీ(89) మృతితో అయన సన్నిహితులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచిన ఈ కమ్యూనిస్టు యోధుడు, భారత లోక్‌సభ మాజీ స్పీకర్.

 Somnath Chatterjees Body To Be Donated For Medical Research-TeluguStop.com

మృత‌దేహానికి అంత్యక్రియలను నిర్వహించడం లేదు.ఈ మేరకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక ప్రకటన చేశారు.

సోమ్‌నాథ్ చటర్జీ మృత‌దేహాన్ని కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎమ్ మెడికల్ కాలేజీకి ఇవ్వబోతున్నట్టుగా మమత ప్రకటించారు.తన మరణాంతరం భౌతికకాయాన్ని పరిశోధనలకు ఉపయోగపడేవిధంగా ఏదైనా మెడికల్‌ కాలేజీకి విరాళంగా ఇవ్వాలని 2002లోనే ఆయన కోరారు.

దీంతో ఆయన కోరుకున్న విధంగా పార్థీవదేహాన్ని స్థానిక ఎస్‌ఎస్‌కేఎమ్‌ హాస్పిటల్‌కు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

మెడికల్‌ కాలేజీకి తరలించే ముందు లీగల్‌ లాయర్‌ అయిన ఈ కమ్యూనిస్టు నేతకు కోల్‌కతా హైకోర్టుతో ఎంతో అనుబంధం ఉంది.దీంతో అయన పార్థీవదేహాన్ని గౌరవార్థం హైకోర్టుకు తరలిస్తారు.అక్కడి నుంచి కోల్‌కతా అసెంబ్లీలో కాసేపు ఉంచి.

నివాళి ఘటించిన అనంతరం మృత‌దేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించనున్నట్టుగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది.ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సోమ్‌నాథ్‌ చటర్జీ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube