జనసేనలోకి ముద్రగడ ..? పవన్ ఆ మాటలతో క్లారిటీ

ఏపీ రాజకీయాల్లో చాలా కాలంగా కాక రేపుతున్న ‘కాపు’ రిజర్వేషన్ అంశం అన్ని పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారింది.అప్పట్లో కొంతకాలం పాటు ఈ అంశం రాష్ట్రాన్ని కుదిపెయ్యడంతో పాటు టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది.

 Mudragada Padmanabham Want To Join Janasena-TeluguStop.com

అప్పట్లో ఈ వివాదాన్ని ముద్రగడ పద్మనాభం ను ముందుపెట్టి జగన్ వెనుకుండి నడిపిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.ఆ తరువాత తరువాత ఆ వివివాదం చల్లారిపోయినట్టు కనిపించింది.

కానీ కొద్ది రోజుల క్రితం ‘కాపు’లకు రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పి నేను మోసం చెయ్యలేనూ అంటూ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో మళ్ళీ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

వైసీపీ తన స్టాండ్ ఏంటో బయటకి బాహాటంగా చెప్పెయ్యడంతో ముద్రగడ జగన్ పై గుర్రుగా ఉన్నారు.

ఇంత సూటిగా చెప్పక కాపు లు వైసీపీ కి ఎందుకు మద్దతు ఇవ్వాలి అంటూ ముద్రగడ జగన్ పై ఫైర్ అయ్యారు.పాదయాత్ర పేరుతో కాపు నేతలతో లక్షలు కోట్లు ఖర్చు పుట్టిస్తున్నారని, కులంలో ఉన్న ఒకరిద్దరిని కూడా నిరుపేదలను చేసే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

వైసీపీ అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్‌కు 10 వేల కోట్లు ఇస్తామని పాదయాత్ర సభలో జగన్‌పేర్కొన్నారని, ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదన్నారు.మేమే 20 వేల కోట్లు ఇస్తాం.ఇతర కులస్థుడికి సీఎం పదవి ఇస్తారా? అంటూ జగన్‌ను ముద్రగడ ప్రశ్నించారు.అలాగే మా డిమాండ్లను పరిష్కరించిన పార్టీనే పల్లకీలో మోస్తామని ముద్రగడ అన్నారు.
ఇప్పటికే చంద్రబాబు మీద అన్ని రకాలుగానూ దుమ్మెత్తి పోసిన ముద్రగడ తెలుగు దేశానికి మద్దతు ఇచ్చే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది.

తాజాగా కాపు రిజర్వేషన్స్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సారిగా స్పందించారు.

కాపుల వెనుకబాటుతనాన్ని తాము గుర్తించామని, కాపులకు రేజర్వేషన్లు ఇచ్చి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.దీంతో కాపుల్లో పవన్ ఇమేజ్ కొంచెం పెరిగింది.

అదీ కాకుండా పవన్ కాపు కులానికి చెందినవాడు కావడంతో ఇప్పుడు ముద్రగడ జనసేన వైపు చూస్తున్నట్టుగా ఆయన సన్నిహితులు చెప్తున్నారు.

పవన్ కూడా ఎక్కువ గోదావరి జిల్లాలపై దృష్టిపెట్టడం, ఆ సామాజికవర్గం ఓట్లు ఈ రెండు జిల్లాల్లోనే ఎక్కువగా ఉండడంతో ముద్రగడ కూడా ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.

ఏదో పార్టీలో తప్పకుండా చేరాలి అదేదో కాపు కులానికి చెందిన పార్టీ అయితే ఏ గొడవా ఉండదు పైగా కాపు ఉద్యమానికి కూడా న్యాయం చేసినట్టు అవుతుందనే ఆలోచనలో ఆయన ఉన్నాడు.పవన్ తూర్పు పర్యటనలో దీనిపై క్లారిటీ ఇచ్చే ఆలోచనలో ముద్రగడ ఉన్నాడట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube