డబ్బులు తీసుకురమ్మని కార్డు ఇస్తున్నారా?అయితే ఇది చదవండి..

ఎటిఎం నుండి డబ్బులు తీసుకురమ్మని మీ ఇంట్లో వారికి కార్డు ఇచ్చి పంపుతున్నారా? మీ ఎటిఎం పిన్ నంబర్ ని ఇతరులతో షేర్ చేసుకుంటున్నారా? అయితే మీరు చేస్తున్నది తప్పు.ఈ చిన్న తప్పుకు మీరు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

 State Bank Rules For Debit Card Usease-TeluguStop.com

ఎందుకో తెలియాలంటే ఎస్బిఐ నిభంధనలేంటో తెలుసుకోండి.

ఏటీఎం కార్డును సంబంధిత ఖాతాదారుడే ఉపయోగించాలనే నిబంధన ఉంది.డబ్బు తీసుకురమ్మని మీ ఏటీఎం కార్డును సమీప బంధువులు, స్నేహితులకు ఇవ్వకూడదూ.ఎవరి ఏటీఎం కార్డు వారే ఉపయోగించాలి అంటూ… కనీసం భార్యకార్డు భర్త, భర్త కార్డు భార్య సైతం ఉపయోగించకూడదని భారతీయ స్టేట్‌ బ్యాంకు చెబుతోంది.

ఎస్బిఐ నిభందన సరైందే అని న్యాయస్థానం కూడా అంగీకరిస్తోంది.ఏటీఎం పిన్‌ను ఇతరులతో పంచుకోవడం నిబంధన ఉల్లంఘనే అవుతుందని ఇటీవల ఒక కేసులో న్యాయస్థానం కేసును కొట్టివేసి ఎస్‌బీఐ నిబంధనలను సమర్ధించింది.

ఈ విషయాన్ని ఖాతాదారులు గ్రహించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనలిలా ఉన్నాయో తెలుసా.

ఒకవేళ అత్యవసరమనుకుని ఏటీఎం కార్డును ఇతరుల ద్వారా నగదు తెప్పించుకునే దశలో భాగంగా ఏటీఎంలో డబ్బు రాకుండా విత్‌డ్రా అయినట్లు రసీదు వస్తే ఆ తర్వాత ఏటీఎం నుంచి డ్రా చేసిన డబ్బు మీ ఖాతాలో ఉన్నా అవి లేనట్లే.ఏటీఎం సీసీ కెమెరాల్లో ఖాతాదారుడికి బదులు ఇతరులు డ్రా చేసినట్లు తెలిసిన అవి నిబంధన ఉల్లంఘించినట్లే అవుతుంది.

కాబట్టి తస్మాత్ జాగ్రత్త.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube