29 సెకన్లలో 29 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండిలా..ఓ గవర్నమెంట్ స్కూలు టీచర్ ఫార్ములా

గీతల ద్వారా చక్కటి చేతిరాత.లెక్కలు సులభంగా చేయడం.

 How To Remember 29 States In 29 Seconds-TeluguStop.com

తొక్కుడు బిల్ల ఆట గీతల ద్వారా పిల్లలకు రెండో ఎక్కం నేర్పడం…డ్యాన్స్ చేస్తూ పాటరూపంలో అక్షరమాల నేర్పిన టీచర్లు ఎంతో మంది సోషల్ మీడియాలో వైరలయ్యారు.ఇప్పుడు 29సెకన్లలో 29రాష్ట్రాల పేర్లను చెప్తున్న ఈ ఉపాధ్యాయుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నరు.

మన దేశంలోని రాష్ట్రాల పేర్లను కేవలం అర నిమిషంలో చెప్పగలరా? కష్టం కదా.కశ్మీర్ నుంచి పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర.ఇలా మూలలు, కోణాలు గుర్తు చేసుకుంటూ చెప్పేయొచ్చు.కానీ అర నిమిషంలో చెప్పమంటే మాత్రం కష్టమే.కానీ ఢిల్లీకి చెందిన ఓ గవర్నమెంట్ స్కూలు టీచర్ సుసాధ్యం చేశాడు.పిల్లలు రాష్ట్రాలను సులువుగా గుర్తుపెట్టుకుని చెప్పుకునే టెక్నిక్‌ ను అతడు నేర్పిస్తున్నాడు.

రాష్ట్రాల పేర్లలోని తొలి అక్షరాలతో ఆయన ఓ ఫార్ములాను తయారు చేశాడు.ఏఏ అక్షరంతో ఎన్ని రాష్ట్రాలున్నాయో రాసి, టకటకా చెప్పేస్తూ పిల్లలకు నేర్పిస్తున్నాడు.

సోషల్ మీడియాలో వైరలైన ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.ఇలాంటి టీచర్ల ద్వారా ప్రభుత్వాలు కొన్ని వీడియోలు రూపొందించి ప్రదర్శిస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube