సోషల్ మీడియాలో వైరలైన దిండ్ల పిల్లోడు,మహింద్రాలో జాబ్ కొట్టేశాడు

మంచంపైన ఆడుకుంటున్న పిల్లాడు కిందికి దిగాలనుకున్నాడు.కాని కిందికి దిగలేక దిగితే పడిపోతానని .

 Anand Mahindra Latest Tweet Goes Viral Little Genius Kid-TeluguStop.com

మంచంపై ఉన్న దిండ్లను ఒక్కోటి కింద పడేసి.ఎంచక్కా ఆ దిండ్లపైకి దిగి పోయాడు.

ఆ పిల్లాడి వయసు నిండా ఏడాది నిండి ఉండదు.ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలైంది.

ఇప్పుడు అదే వీడియో మహింద్రా కంపెని అధినేత ఆనంద్ మహింద్రా కంటపడింది.వెంటనే ఆ పిల్లాడికి ఉద్యోగం ఇస్తున్నట్టు ట్వీట్ చేశారు ఆనంద్ మహింద్రా.

ఏడాది నిండని పిల్లాడు ఏం ఉద్యోగం చేస్తాడు అని ఆశ్చర్యపోతున్నారా?బెడ్ దిగడానికి దిండ్లును కిందపడేసి సేఫ్‌గా లాండ్ కావడం చూసిన నెటిజన్లు వాడి తెలివిని వాట్ ఏ జీనియస్ అంటూ పొగిడేసారు.చాలా షార్ప్ పిలగాడు అంటూన కితాబులిచ్చేశారు.ఇటీవల ఈ వీడియో చూసిన ఆనంద్ మహింద్రా వాడి టాలెంట్‌కు ఫిదా అయిపోయి జాబ్ ఇస్తున్నట్లు ప్రకటించారు.ఇప్పుడే కాదులెండి.బుడ్డోడు కాలేజీ చదువు పూర్తిచేసుకున్న తర్వాత.‘ఓకే.

ఈ చిన్నోడు కాలేజీ పూర్తి చేసుకున్నాక కాంట్రాక్టు కుదుర్చుకుంటాను.వీడు మేం చేపట్టే ప్రాజెక్టులన్నీ సులువుగా ల్యాండ్ అయ్యేలా చూస్తాడు.

వాట్ ఏ లిటిల్ జీనియస్.’ అని ట్వీట్ చేశాడు ఆనంద్.

ప్రతిభ ఉంటే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వాటంతట అవే వస్తాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ.చూడాలి పెద్దయ్యాక మహింద్రాలో ఉద్యోగం చేస్తాడో అంతకంటే పదింతలు ఎక్కువ ఎదుగుతాడో.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube