డబ్బులిస్తే పాజిటివ్ .. లేకపోతే నెగటివ్ ! వైసీపీలో వసూల్ రాజాల కలకలం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుంటూ ఇప్పుడిప్పుడే కాస్త ప్రజల్లో సానుబూహి సంపాదిస్తోంది.ఆ పార్టీ అధినేత జగన్ కూడా ఈసారి పార్టీని ఎలా అయినా అధికారంలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు.

 Money For Positive Talk In Ysrcp New Trend-TeluguStop.com

పాదయాత్ర చేస్తూ జనాల్లో మద్దతు కూడగడుతున్నాడు.అయితే ఆ పార్టీలో కొంతమంది నాయకులు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా తమ జేబులు నిండితే సరిపోతుంది పార్టీ ఏమైపోతే మాకెందుకులే అన్నట్టు వ్యవహరిస్తూ పార్టీని దెబ్బ తీస్తున్నారు.

అసలే వచ్చేది ఎన్నికల సమయం కావడంతో కొంతమంది నాయకులను టార్గెర్ట్ చేసుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్టు వైసీపీ లో ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఒకవైపు పార్టీలో చురుకుగా ఉన్నట్టు కనిపిస్తూనే … తమ వ్యక్తిగత స్వార్థంతో, పార్టీ టికెట్ల ఆశతో అయిన కాటికి డబ్బులు తీసుకుంటూ కొంతమంది దందాలను నడిపిస్తున్నారని తెలుస్తోంది.టికెట్ విషయంలో లాబీయింగ్ అంటూ వీళ్లు తమ దందాను అడ్డు అదుపు లేకుండా సాగిస్తున్నట్టు తెలుస్తోంది.వైసీపీ బలంగా ఉన్న జిల్లాల్లో ఇలాంటి దందాలు బాహాటంగా నడుస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

తాము జిల్లా ముఖ్య నేతలకు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అందిస్తూ ఉంటామని, తమకు డబ్బులు బాగా ఇస్తే జిల్లా నాయకత్వానికి పాజిటివ్ రిపోర్టులు ఇస్తామని.ఒకవేళ తమకు డబ్బులు ఇవ్వకపోతే మీ పని తీరు బాగోలేదని రిపోర్టు ఇస్తామని పార్టీ టికెట్లు ఆశిస్తున్నా నాయకుల వద్ద వీరు వసూళ్ళకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.

పార్టీ నాయకులే ఇలా ఉన్నారనుకుంటే జగన్ పత్రికలో పనిచేసే ఓ కీలక రిపోర్టర్ కూడా ఈ దందాలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది.మేము అడిగినంత ఇవ్వకపోతే మీ మీద నెగిటివ్ వార్తలు వచ్చేలా చేస్తానని, నాకు అన్ని పేపర్లలో రాయించే సత్తా ఉందని చెప్పుకుంటూ నేతలను బెంబేలెత్తిస్తున్నట్టు తెలుస్తోంది.

వీళ్లంతా తమకు డబ్బులిస్తే చాలు పనితీరు ఏ మాత్రం బాగోలేకపోయినా.వాళ్ల గురించి పాజిటివ్ రిపోర్టులు ఇస్తారు.

డబ్బులు ఇవ్వకపోతే మీ గురించి నెగిటివ్ రిపోర్టులు ఇస్తామంటూ బెదిరింపులు చేస్తూ తమ జేబు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube