ఇదెక్కడి టాస్కులయ్యా బిగ్ బాస్? బేసిక్ సెన్స్ లేదా? ఆడదానితో కుస్తీ .. గెలిచినోడ్ని కెప్టెన్?

నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ 61 ఎపిసోడ్‌లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసింది.ఏమైనా జరగొచ్చు అనే టాగ్ లైన్ తో స్టార్ట్ అయిన ఈ షోలో కౌశల్ ని టార్గెట్ చేయడం తప్ప కొత్తగా ఏం జరగట్లేదు.

 Fighting Game Between Male And Females Bigg Boss Telugu-TeluguStop.com

కౌశల్ ని టార్గెట్ చేయడం చివరికి కౌశల్ ఆర్మీ దెబ్బకు ఎలిమినేట్ అవ్వడం కామన్ అయిపొయింది.మరి ఈ సారి కౌశల్ తో గొడవ పెట్టుకుంది పూజ.ఇక కౌశల్ ఆర్మీ నెక్స్ట్ టార్గెట్ ఆమెనె.! కాకపోతే సరికొత్తగా గణేష్ కూడా కౌశల్ పై కామెంట్స్ చేసినట్టు టాక్.

అదెంతవరకు నిజమో తెలియదు.

కాకపోతే ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే…బిగ్ బాస్ పెట్టె టాస్కులపై చాలా మంది అభిమానులు విరుచుకుపడుతున్నారు.పురుషులకు, మహిళలకు మధ్య కుస్తీ పోటీలు, ఎక్కడపడితే అక్కడ పట్టుకోవచ్చు.గిల్లొచ్చు.

గిచ్చొచ్చు.కింద పడేయొచ్చు.

ఎక్కి తొక్కేయొచ్చు.ఇష్టం వచ్చినట్టు నలిపేయొచ్చు.

సుమారు రెండు గంటల పాటు ఓ మహిళా కంటెస్టెంట్‌ను అక్కడ ఇక్కడా అని కాకుండా కిందా మీద పడేస్తూ ఆటాడుకోవచ్చు.చివరికి ఆమెను ఓటమికి బాధ్యురాల్ని చేస్తూ.

చివరికి ఆమెని ఎక్కి తొక్కేసినాడు విన్నర్.కెప్టెన్.

ఇదెక్కడి టాస్కులయ్యా బిగ్ బాస్.ఇదొక్కటే కాదు.

ఈ మధ్య ప్రతి టాస్కులో ఇలాగె జరుగుతుంది.కబడ్డీలో, రన్నింగ్ రేస్ లో, పెయింటింగ్ లో…!

గేమ్‌ని గేమ్‌లా చూడాలనడం కరెక్టే కానీ కొన్ని విలువలు ఉండాలి కదా.? ఎలిమినేషన్ ప్రక్రియ కానివ్వండి, కెప్టెన్ రేస్ కానివ్వండి, లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇలా ఏదైనా బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌లు మొత్తం గందరగోళమే.కెప్టెన్ ఎంపిక, నామినేషన్ ప్రక్రియ తదితర అంశాల్లో పురుషులు, మహిళలు మధ్య ఫిజికల్ టాస్క్‌లు పెట్టి పురుషుల్ని విజేతలుగా ప్రకటించడం ఎంత వరకూ కరెక్ట్ అనేది? సామాన్యుడి ప్రశ్న.

మగాళ్లతో సమానంగా ఆడవాళ్లు పరిగెట్టగలరా? కబాడీ ఆడగలరా? స్మిమ్మింగ్ ఫూల్‌లో ఈదగలరా? టైర్‌లో మనిషిని పెట్టుకుని లాగ గలరా? వాళ్లతో సమానంగా తినగలరా? గోడలకు సున్నం కొట్టగలరా? అన్న మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా మగాళ్లతో పోటీ పడండి.కెప్టెన్ అవ్వండి అంటే వీటిని పిచ్చి టాస్క్‌లు కాక మరేం అనాలి? గేమ్ అన్నాక తన్నుకుంటారు కొట్టుకుంటారు.కాని లిమిట్స్ అంటూ ఏం ఉండవా? ఆడవాళ్ల శరీరాన్ని ఇష్టం వచ్చునట్లు తాకొచ్చా? పోని పైన ఉన్న వాళ్లు ఫిజికల్ అటాక్ వద్దు అంటారంటే కమాన్.కమాన్.

అంటూ చప్పట్లు కొట్టి మరీ ప్రోత్సహించడం.దీన్నంతటినీ అద్భుతమైన ఎంటర్ టైన్‌మెంట్ అని బిగ్ బాస్ ప్రతిరోజు గంటల తరపడి టెలికాస్ట్ చేయడం ఏంటో.? మనకు చూపించే దాంట్లోనే ఇంత ఉంటె.? ఇంకా చూపించండి ఎంత ఉందొ?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube