టీడీపీ నాయకుల నోటికి తాళం పడిందా ..? జగన్ కి ఆ విషయం కలిసొస్తుందా ..?

ప్రస్తుతం టీడీపీ నాయకులకు పెద్ద చిక్కొచ్చి పడింది.వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో వైఎస్ భారతి పేరును ఈడీ అధికారులు చేర్చడంతో కొద్ది రోజులుగా ఈ వ్యవహారం ప్రధాన వార్తగా జనాల్లో కి వెళ్లిపోయింది.

 Jagan Strong Counter To Tdp-TeluguStop.com

ఇప్పుడు అది కాస్త అటు ఇటు తిరిగి తెలుగుదేశం మెడకే చుట్టుకునేలా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి.వాస్తవానికి కేంధ్ర అధికార పార్టీ బిజెపితో వైసీపీ రహస్య పొత్తు పెట్టుకుంది.

జగన్ తన కేసులు మాఫీ చేయించుకునేందుకు కేంద్రంతో లాలూచి పడ్డాడు అంటూ టీడీపీ నాయకులంతా విమర్శలు చేస్తూ వస్తున్నారు.

నిజానికి నాలుగేళ్లపాటు బిజెపితో టీడీపీ కలిసి తిరిగింది కేంద్ర క్యాబినెట్లో టీడీపీ కి పదవులు దక్కాయి, అలాగే రాష్ట్ర క్యాబినెట్లో బిజెపికి మంత్రి పదవులు దక్కాయి.

అయితే.ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య పొత్తు చెడిపోయింది.ఇప్పుడు బీజేపీ మీద విమర్శలు చేస్తూ టీడీపీ రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తోంది.అయితే బీజేపీ రాష్ట్ర పార్టీ కాదు.

ఏపీలో బలంగా ఉన్న పార్టీ కాదు.అలాంటిప్పుడు బీజేపీపై వ్యతిరేకతను పెంచి చంద్రబాబు నాయుడు పెద్దగా లాభపడేది మాత్రం ఏమీ ఉండదు.

వైసీపీ బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకుందని తరచూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తూ వస్తున్నారు.అయితే తాజాగా వైఎస్ జగన్ భార్య భారతి మీద ఈడీ చార్జిషీటు దాఖలు చేయడానికి కోర్టు అనుమతిని కోరింది.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో టీడీపీ మంచి హుషారు లో ఉంది.అయితే బిజెపితో జగన్ లాలూచి పడ్డాడని ఆరోపణలు చేస్తూ వస్తున్న టీడీపీ కి ఇక అక్కడితో ఆ అవకాశం కోల్పోయినట్టు అయ్యింది.

జగన్ కూడా ఇక్కడే తన తెలివి తేటలను కూడా ఉపయోగించాడు.టీడీపీ నాయకుల నోరు మూయించేలా సమాధానాలు చెప్తున్నాడు.

ఒకవేళ నేను బిజెపితో లాలూచి పది ఉంటే.తనపై కేసులు ఎలా ఉంటాయని జగన్ ప్రశ్నిస్తున్నాడు.

అటు బీజేపీ, ఇటు తెలుగుదేశం కలిసి తమ కుటుంబంపై కూడా వేధింపులు కొనసాగిస్తూ ఉన్నాయని జగన్ ప్రజల్లో సానుభూతి సంపాదించే పనిలో పడ్డాడు.దీంతో టీడీపీ డైలమాలో పడిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube