గూఢచారి పెట్టుబడి, రాబడి ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెడతారు

అడవి శేషు చేసిన సినిమాల సంఖ్య చాలా తక్కువే అయినా కూడా మంచి గుర్తింపును మాత్రం తెచ్చుకుంటున్నాడు.ఆమద్య క్షణం చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకున్న అడవి శేషు తాజాగా గూఢచారి చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

 Adivi Sesh Goodachari Movie Superb Collections-TeluguStop.com

గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతూ వస్తుంది.మొదటి మూడు రోజుల్లోనే ఈ చిత్రం పెట్టుబడిని రికవరీ చేసిందని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

పెద్ద సినిమాలు పోటీ లేకపోవడంతో పాటు, తక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రం రావడం వల్ల సినిమాకు సేఫ్‌ అయ్యింది.ఈ చిత్రాన్ని కేవలం 5.5 కోట్లతో తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది.ఇంత తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన కారణంగా ఈజీగానే బడ్జెట్‌ రికవరీ అయ్యింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో ఈ చిత్రం భారీ ఎత్తున వసూళ్లు రాబడుతున్న కారణంగా ఈ చిత్రం నిర్మాతకు పెట్టుబడికి రెండు రెట్లు లాభం వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.

ఓవర్సీస్‌లో ఈ చిత్రం దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయలను వసూళ్లు చేసిందని తెలుస్తోంది.తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది.మొదటి మూడు రోజుల్లోనే చిత్రం పెట్టుబడిని వసూళ్లు చేయడంతో ఇంకా భారీగా వసూళ్లు నమోదు అవుతాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఈ వారం మొత్తంలో మరో అయిదు కోట్ల రూపాయలను వసూళ్లు చేయనుందని, ఇక శాటిలైట్‌ రైట్స్‌ మరియు ఆన్‌లైన్‌ రైట్స్‌ ద్వారా, రీమేక్‌, డబ్బింగ్‌ రైట్స్‌ ద్వారా మరో అయిదు కోట్ల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది.దాంతో ఈ చిత్ర నిర్మాతకు పది కోట్ల మేరకు లాభం చేకూరబోతుందని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు.

అయిదు కోట్ల పెట్టుబడికి 15 కోట్లను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు.మొత్తానికి గూఢచారి చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతున్నందుకు అడవి శేషు ప్రధాన కారణం అని, సుప్రియ ఈ చిత్రంలో నటించడం కూడా అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube