పవన్ ఎర్ర కండువా జగన్ మెడలో పడబోతోందా ..

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ .ఆ పార్టీ కార్యకర్తలు ఎక్కువగా ఎర్ర కండువా వేసుకుని తిరుగుతుంటారు.

 Left Parties Want Tie Up With Ys Jagan In Ap-TeluguStop.com

అలాగే పవన్ కూడా ఎర్ర పార్టీలుగా పేరున్న కమ్యూనిస్ట్ పార్టీలతో దోస్తీ చేస్తూ తనది కూడా అదే సిద్ధాంతం అని చెప్పుకుంటూ నిత్యం విప్లవ భావాలు ప్రకటిస్తుంటాడు.ఇక కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పవన్ ని బాగానే నమ్మాయి.

అందుకే పవన్ చుట్టూనే ఇప్పటివరకు తిరుగుతూ కనిపించాయి.ఇక ఎన్నికల్లో సీపీఐ , సీపీఎం పార్టీలు జనసేనతో కలిసి వెళ్ళబోతున్నాయి అనుకుంటున్న సమయంలో ఇప్పుడు ఆ రెండు ఎర్ర పార్టీలు పవన్ కి హ్యాండ్ ఇచ్చినట్టు కనిపిస్తున్నాయి.

పవన్ రాజకీయల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ శాతం వామపక్షాల వైపు మాట్లాడుతూ వచ్చారు.దాంతో పవన్ కి వామపక్షాలు చేరువ అవుతాయని భావించారు.కానీ ఈ మద్య ఓ కార్యక్రమంలో పొత్తు గురించి మాట్లాడగా అవేమీ ఇప్పట్లో ఉండవనే హింట్ ఇచ్చారు పవన్.పవన్ కల్యాణ్ వెంట ఉన్న వామపక్షాలకు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కలవరపరిచాయంటున్నారు.

నియోజక వర్గ పరిశీలకుల నియామకాలతో పాటు పార్టీలోని కీలక పదవులను ఒకే కులానికి చెందిన వారికే ఇవ్వడం వామపక్ష నాయకులకు ఆగ్రహం తెప్పించింది.

కొంత కాలంగా జగన్ చేస్తున్న పాదయాత్ర దానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎర్ర పార్టీలు జగన్ వైపు చూసేలా చేస్తున్నాయ్.

కాపు రిజర్వేషన్లపై జగన్ చేసిన ప్రకటన వామపక్షాల నాయకులలో ఆలోచనలను రేకెత్తించింది.ఇక బిజేపీకి జగన్ మద్దతు ఇస్తారని ఆయన నరేంద్ర మోదీ మనిషేనని చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనలను సీపీఐ, సీపీఎం పార్టీలు నమ్మడానికి సిద్ధంగా లేవు.

మొన్నటి వరుకు టీడీపీని టార్గెట్ చేసుకొని జగన్, పవన్ లు విమర్శలు చేస్తూ వస్తున్నారు.దాంతో వైసీపీ-జనసేన పొత్తులు ఉండబోతున్నాయని తెగ వార్తలు వచ్చాయి.

కానీ తూర్పు గోదావరి జిల్లాలలో పవన్ పర్సనల్ లైఫ్ పై జగన్ కామెంట్ చేయడం.జగన్ జైలు జీవితంపై పవన్ కామెంట్ చేయడంతో వీరిద్దరి మధ్య ఇక పొత్తు ఏ మాత్రం ఉండే అవకాశం కనిపించడంలేదని అందరికి అర్ధం అయిపొయింది.ఇప్పుడు వామపక్ష పార్టీలు కూడా పవన్ కి హ్యాండ్ ఇచ్చేందుకు చేస్తుండడంతో పవన్ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube