దానివల్ల నాకు ఒకరోజంతా నిద్రపట్టలేదు..! గీత గోవిందం ఈవెంట్ లో విజయ్ దేవరకొండ డేరింగ్ స్పీచ్.!

‘గీతా గోవిందం’ సినిమాలో నేను పాడిన పాట ‘వాట్ ది ఎఫ్’ ఇటీవల విడుదల చేయడంతో పెద్ద వివాదం అయ్యింది.నన్ను రెండు రోజుల పాటు ఈ పాటకోసం ఆడియన్స్‌తో పాటు వివిధ సంఘాల వారు గట్టిగా వేసుకున్నారు.

 Vijay Devarakonda Rocking Speech At Geetha Govindam Audio-TeluguStop.com

దెబ్బకి లిరిక్స్ రైటర్ శ్రీమణి గారు అండర్ గ్రౌండ్‌కి వెళ్లారు.దర్శక, నిర్మాతలు ఈ పాటను నేను పాడాలని అనడంతో పాడాను.

ఆ పాట సెన్సేషన్ అయ్యింది.అయితే మేము అనుకున్న సెన్సేషన్ కాదు.

ఎలా సెన్సేషన్ అయ్యిందో మీరే చూడండి అంటూ వాట్ ది ఎఫ్ సాంగ్‌పై వచ్చిన మీమ్స్, ట్రోల్స్‌ని స్క్రీన్‌పై వేసి మరీ చూపించారు విజయ్ దేవరకొండ.

విజయ్ దేవరకొండ, రష్మికా మందాన జోడీగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో తెరకెక్కిన ‘గీతా గోవిందం’ మూవీ పాటల వేడుక హైదరాబాద్‌లో ఆదివారం నాడు వైభవంగా సాగింది.ఆ సినిమాలో విజయ్ పాడిన పాటకు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్ల్స్ వచ్చాయి.ఈ విషయాన్నీ స్టేజి పైనే ఒప్పుకున్నాడు విజయ్ దేవరకొండ.

నిజాయితీగా ఈ విషయాన్నీ ఒప్పుకోవాలి అంటే చాలా గట్స్ ఉండాలి.విజయ్ దేవరకొండ బ్రదరు నువ్వు సూపర్ అంటూ ప్రస్తుతం ఆయనపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వాట్ వాట్ ఎఫ్.అమ్మాయిలంటే టఫ్.అని నేను పాట పాడితే.ఇలా రకరకాలుగా ఆడుకున్నారు.

మొత్తానికి లిరిక్స్‌పై అభ్యంతరాలు ఉన్నాయని మర్చేస్తున్నామ్.మార్చిన లిరిక్స్‌తో మళ్లీ నాతోనే పాడించారు.

మొత్తానికి దీనితో నా గొంతు నచ్చలేదని తేలిపోయింది.అయితే ఈ పాటను మీరే పాడండి మీతోనే పాడించుకుంటాం అది సినిమాలో పెట్టుకుంటా అంటూ ‘వాట్.

వాట్.లైఫ్’ అంటూ కొత్తగా పాడిన పాటను విడుదల చేశారు.

మొత్తానికి ‘వాట్ ది ఎఫ్’ పాటలో ‘ఎఫ్’ ప్లేస్‌లో లైఫ్‌ని యాడ్ చేశారు.మొత్తానికి ఏది ఏమైనా నా రౌడీస్ నన్ను హేట్ చేస్తారు… అలానే లవ్ చేస్తారు.

అంటూ చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube