లోకేష్ అసెంబ్లీకి పోటీ చెయ్యడం లేదా ...మరేం చేస్తాడు...

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తు మీద ఆయన తండ్రి కే కాదు అందరికి ఆసక్తి పెరిగిపోయింది.కొద్దీ రోజుల క్రితం లోకేష్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ కి పోటీ చేయబోతున్నాడు అనే వార్హలు షికారు చేశాయి.

 Nara Lokesh Wants Mp Seat For Next Election-TeluguStop.com

అంతే కాదు ఆయన చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేయబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపించాయి.కుప్పం కానీ, చంద్ర గిరి నియోజకవర్గం నుంచి కానీ లోకేష్ పోటీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు లోకేష్ అసెంబ్లీ కి పొట్టే చేయడం లేదని ఆయన ఎంపీగా ఢిల్లీ రాజకీయాల్లో బిజీ కావాలనుకుంటున్నట్టు కూడా తాజాగా వార్తలు వస్తున్నాయి.

తొలి సారి ఎమ్మెల్సీగా నామినేట్ అయిపోయి మంత్రి అయిపోయాడు లోకేష్ బాబు.తండ్రి ముఖ్యమంత్రి సీట్లో ఉండడంతో ఈజీగా మంత్రి అయిపోయాడు.ఇక వచ్చే ఎన్నికల్లో అయినా లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాడా? అనేది సందేహం అందరిలోనూ ఉండగానే ఎంపీ అవ్వాలనుకుంటున్నాడు అనే వార్తలు అందరిలోనూ ఆసక్తి లేపుతోంది.లోకేష్ బాబు లోక్‌సభకు వెళ్లాలని అనుకుంటున్నాడని, ఢిల్లీలో అయితే లోకేష్ బాగా నేర్చుకుంటాడని అనుకుంటున్నారట తెలుగుదేశం వాళ్లు.అయితే తెలుగు మాట్లాడే అసెంబ్లీలో ఏమీ నేర్చుకోలేని లోకేష్ బాబు హిందీ, ఇంగ్లిష్ మాట్లాడే ఢిల్లీ వెళ్లి నేర్చుకునేది ఏమిటి ? అనే సందేహం కలుగుతోంది.

లోకేష్ ఢిల్లీ వెళ్లాలని అనుకుంటున్నాడని అంటున్నారు.మరి లోక్ సభకు పోటీ చేస్తాడా? లేక సింపుల్ గా రాజ్యసభకు నామినేట్ అయిపోయి.తను ఎంపీని అయ్యానని గొప్పలు చెప్పుకుంటాడో చూడాలి.

ఈయన ఎంట్రీనే దొడ్డిదారిన జరిగింది.నామినేటెడ్ పోస్టుతో మంత్రి అయ్యాడు.

ఇక తొలిసారి అంటే అలా కామెడీ అయిపోయాడు.ముందు ముందు అయినా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉంది లోకేష్ కు.అయితే ఇప్పటి వరకూ లోకేష్ కు నియోజకవర్గం దొరకడం లేదు.ఈ విషయంలో టీడీపీకే స్పష్టత లేదు.

అసలు ఎమ్యెల్యేగా గెలిచే ఛాన్స్ ఉందా అనే సందేహం అందరిలోనూ ఉండగానే ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నాడు అనే వార్త నమ్మశక్యంగా లేదు.బహుశా మొన్నటిలాగే దొడ్డి దారిన ఎంపీ అయిపోడు కదా .?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube