నెట్ లో హల్చల్ చేస్తున్న ఈ ఫోటోపై సమంత ఫన్నీ కౌంటర్.! చూసి నవ్వుకోండి!

సమంత…పరిచయం అక్కర్లేని పేరు.ఏం మాయ చేసావేతో కుర్రాళ్ళ హృదయాలకి గేలం వేసింది.

 Samantha Funny Reply About Her Morphing Photo-TeluguStop.com

గత దశాబ్దం నుండి తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత దాదాపు అగ్ర హీరోలందరితో నటించి హిట్స్ అందుకుంది.సమంత హీరోయిన్ అంటే హిట్ గారంటీ అన్న సెంటిమెంట్ సంపాదించుకుంది.

ఆమె సినిమాలు వదిలేస్తుంది అని ఇటీవలే ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది.కానీ అది అవాస్తవం అని స్పందించింది సమంత.

టాప్ హీరోయిన్ గా మాత్రమే కాదు అక్కినేని ఇంటి కోడలిగా కూడా సమంత మంచి పేరు తెచ్చుకుంది.చైతన్య సమంత ల లవ్ స్టోరీ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు కదా.ఇది ఇలా ఉంటె సమంత ట్విట్టర్ లో ఎంత ఆక్టివ్ గా ఉంటుందో అందరికి తెలిసిందే.ఒక పక్క ప్రత్యూష ఫౌండేషన్ తో పిల్లలకి సహాయం చేస్తూనే మరోపక్క ఫన్నీ కౌంటర్ లు కూడా వేస్తుంది.

ఇప్పుడు అసలు కథ ఏంటంటే.? అక్కినేని ఇంటి కోడలు వారం రోజుల కిందట ఇంటి నుంచి పారిపోయింది.ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంది.ఆ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.ఇదేదో సినిమా సీన్ అనుకోవద్దు.ఈ విషయం సమంతానే స్వయంగా చెప్పింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.ఓ అభిమాని సమంత పెళ్లి ఫొటో పక్కన తన ఫొటో పెట్టి.ఇద్దరికీ పెళ్లయినట్లు మార్ఫింగ్ చేశాడు.ఈ ఫొటోను అల్లు అర్జున్‌ అడిక్ట్‌ అనే ట్విటర్ అకౌంటర్.సమంతకు ఆ ఫొటోను ట్వీట్ చేసి.‘‘ఏంటిది.?’’ అని అడిగాడు.ఆ ఫొటో చూసిన సమంత.

చాలా ఫన్నీగా స్పందించింది.‘‘వారం క్రితమే పారిపోయాం.

ఈ ఫోటో ఎలా లీకైందో అర్థం కావట్లేదు.తొలి చూపులోనే ప్రేమించుకున్నాం’’ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube