ఫ్రెండ్ రేప్ చేసాడు..! క్రికెటర్ చిక్కుల్లో పడ్డాడు..! అసలేమైందో తెలుస్తే షాక్ అవుతారు.!

కొన్ని సార్లు ఎవరో చేసిన తప్పుకు మనం శిక్ష అనుభవించాల్సి వస్తుంది.శ్రీలంక స్టార్ క్రికెటర్ దనుష్క గుణతిలక ప్రస్తుతం అలాంటి పరిస్ధితినే ఎదుర్కొన్నాడు.

 Rape Scandal In Sri Lanka Cricket Danushka Gunathilaka Suspended-TeluguStop.com

శ్రీలంక బ్యాట్స్‌మన్ దనుష్క గుణతిలకను అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది అక్కడి క్రికెట్ బోర్డు.ప్రస్తుతం శ్రీలంక, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ సందర్భంగా మూడో రోజు ఆట తర్వాత లంక బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

అతడు కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందువల్లే సస్పెండ్ చేశామని, దీనిపై విచారణ జరుపుతామని మాత్రమే లంక బోర్డు వెల్లడించింది.

గుణతిలక స్నేహితుడు హోటల్ గదిలో తనను రేప్ చేశాడని నార్వేకు చెందిన ఓ యువతి ఆరోపణలు చేయడంతో బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది.

రేప్ జరిగిన సమయంలో క్రికెటర్ కూడా హోటల్‌ గదిలోనే ఉన్నాడని ఆమె ఆరోపించింది.

కొలంబోలో క్రికెటర్లు బస చేస్తోన్న హోటల్ గదికి గుణతిలక, అతడి స్నేహితుడు (శ్రీలంక సంతతికి చెందిన బ్రిటన్ వ్యక్తి ) కలిసి.ఆదివారం వేకువ జామున ఇద్దరు నార్వే మహిళలను తీసుకెళ్లారు.ఆ ఇద్దరు నార్వే మహిళల్లో ఒకరు.

హోటల్‌లో తనపై అత్యాచారం జరిగిందని పేర్కొన్నారు.ఈ ఉదంతం జరిగినప్పుడు అదే గదిలో క్రికెటర్ గుణతిలక కూడా ఉన్నాడని వివరించారు.

బాధితురాలు.పోలీసులకు ఫిర్యాదు అందటంతో దనుష్క స్నేహితుడిని అరెస్ట్ చేశారు.కాగా నిందితుడి పేరును మాత్రం పోలీసులు వెల్లడించలేదు.కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

అయితే దనుష్క గుణతిలకపై ఎలాంటి ఆరోపణలు లేవని పోలీసులు స్పష్టం చేశారు.

అయితే కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించాడంటూ దనుష్కపై లంక క్రికెట్ బోర్డు సీరియస్ అయి వేటు వేసింది.

శ్రీలంక క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం ఆటగాళ్లు అర్థరాత్రి లోపే హోటల్ గదులకు చేరుకోవాలి.అతిథులను గదులకు ఆహ్వానించకూడదు.మరోవైపు గుణతిలక గతంలో పలుమార్లు సస్పెన్షన్‌కు గురయ్యాడు.ప్రాక్టీస్ సెషన్‌ను ఎగ్గొట్టడం.

రాత్రి సమయాల్లో పార్టీలకు ఎక్కువ సమయం కేటాయించడం వంటి ఆరోపణలతో మ్యాచ్‌ల నిషేధంతో పాటు మ్యాచ్‌ ఫీజులో సైతం కోత విధించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube