సీన్ రివర్స్..మోడీ గ్రాఫ్ పెంచిన బాబు..

మాట మాట్లాడితే నా అనుభవం ఇంతా…నా ముందు మీరెంత.ఆఫ్ట్రాల్.

 Seen Reverse Babu Praises Narendra Modi-TeluguStop.com

ప్రధాని పదవినే వద్దని అనుకున్నాను అంటూ చంద్రబాబు కొట్టే డబ్బు క్యాసెట్ వినీ వినీ ఏపీ ప్రజల చెవులు.ముఖ్యంగా విలేఖరుల చెవులకి చిల్లులు పడిపోయాయి.

ఆయన ఒక్కరే అంటే అనుకోవచ్చు తన డబ్బుని మిగతా నాయకులు కూడా కొట్టడం పరిపాటే అయితే బాబు గారి అనుభవం అంతా దొంగలు ఎత్తుకెళ్ళారా.? విభజన విషయంలో తప్పటడుగులు ఎందుకు వేశారు.మోడీ ఇమేజ్ ని పెంచే భాద్యత లోపాయి కారిగా భుజాన వేసుకున్నారా.? సరే వివరాలలోకి వెళ్తే.

గత ఎన్నికల్లో అధికారంలోకి మోడీ వచ్చిన తరువాత మోడీ ప్రతిష్ట అంచెలంచెలుగా ఎదుగుతూ నమో ఓడీ అంటూ అన్న ప్రజలు గత కొంత కాలంగా జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా దేశవ్యాప్తంగా మోడీ ని పక్కన పెట్టేశారు.ఆయనకీ ప్రజలలో ఉన్న ఆకర్షణ రోజు రోజుకి తగ్గుతూ వచ్చింది…అంతేకాదు కొన్ని సర్వేలు సైతం మోడీ పై దేశ ప్రజలు అనాసక్తిగా ఉన్నారని తెలిపాయి.

ఎన్డీయే లో వచ్చిన లుకలుకలు ఇవన్నీ మోడీ ని డమ్మీ చేసిపడేశాయి.అయితే

ఆయన ప్రజాకర్షకశక్తి రోజురోజుకూ తగ్గిపోతోందని నెలరోజుల కిందట పలు సంస్థలు నిర్వహించిన సర్వల్లో తేలిన విషయం తెలిసిందే.అంతేగాకుండా.ఎన్డీయేలో లుకలుకలు మొదలయ్యాయని, ఇక పలు మిత్ర పక్షాలు కూడా బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి…అయితే ఈ క్రమంలో బీజేపీ పతనం మొదలవుతోంది అనుకున్న తరుణంలో బాబు ప్రవేశ పెట్టిన అవిశ్వాసం చిరిగి చాటయ్యింది.

అమాంతం మోడీ గ్రాఫ్ పెంచేసింది…తనకి మద్దతు ఇస్తారని అనుకున్న శివసేన, జేడీయూ తదితర పక్షాలు బాబు కి హ్యాండ్ ఇచ్చి మోడీ కి షేక్ హ్యాండ్ ఇచ్చాయి.దాంతో బాబు కి దిమ్మతిరిగిపోయింది.

అవిశ్వాసం తీర్మానంపై చర్చ అనంతరం జరిగిన ఓంటింగ్‌తో ఇప్పటికీ ఎన్డీయే ఎంత బలంగా ఉందో ప్రతిపక్షాలకు తెలిసివచ్చిందని ఈ అవిశ్వాసం మోడీ కి కలిసొచ్చిందని అంటున్నారు నిపుణులు…ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా 325ఓట్లు, వ్యతిరేకంగా 125ఓట్లు పడ్డాయంటేనే టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఏస్థాయిలో వీగిపోయిందో అర్థమవుతుంది.దాంతో బాబు ప్రవేశపెట్టిన అవిశ్వాసంతో మోడీ బలాన్ని దేశవ్యాప్తంగా తెలిసిందనీ, ఇప్పుడున్న బలంతో మోడీని ఓడించడం ప్రతిపక్షాలకు అంత సులువుకాదన్న విషయం స్పష్టమైందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏది ఏమైనా సరే బాబు గారి అనుభవం మోడీ ముందు పిల్లిమొగ్గలేసింది అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube