ఆట మొదలు పెట్టిన జగన్..చంద్రబాబు కి మూడినట్లేనా

నిన్న పార్లమెంట్ లో జరిగిన అవిశ్వాస తీర్మానం తాలూకు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినదే ఎప్పటిలాగానే టీడీపీ ప్రభుత్వం తాలూకు ఎంపీలు తెచ్చుకున్న స్క్రిప్ట్ ని చెకచెకా మసాలా జోడించి టాలీవుడ్ యాక్టర్లు కూడా సిగ్గుపడేలా చేసిన పెర్ఫార్మెన్స్ నభూతో నభవిష్యతి.సరే ఇక అవిశ్వాసం వీగిపోయింది ఈ విషయం టీడీపీ తో పాటు అందరికి తెలిసిందే అయితే అవిశ్వాసం విషయంలో టీడీపీ నాటకాలు బయటపడితే ఒక ఆట ఆడుకుందామని ఎప్పటి నుంచో వేచి చూస్తున్న జగన్ కి సరైన సమయం దొరికింది.అందుకే

 Ys Jagan Calls Andhra Bandh On 24 July Over Special Status-TeluguStop.com

ఈ అంశాన్ని జగన్ పూర్తిగా వాడుకోవాలని డిసైడ్ అయిపోయాడు.అందుకు తగ్గట్టుగానే తన వ్యుహాలకి పదును పెట్టాడు.ఇప్పటికే తెలుగుదేశం కేంద్రంపై అవిశ్వాసం పెట్టి హైలెట్ అవుతుంటే టీడీపీ కంటే ముందుగానే అవిశ్వాసం అంశం ఎత్తుకుని ఉన్న వైసీపీ సైలెంట్ అయిపొయింది అయితే నిన్నటి పరిస్థితుల దృష్ట్యా జగన్ ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు.అందులో భాగంగానే ఈ నెల 24 వ తేదీన ప్రత్యేక హోదా విషయంపై రాష్ట్ర బంద్ ప్రకటించారు.

ఈరోజు ఉదయం కాకినాడలో ప్రెస్ మీట్ పెట్టిన వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, ప్రజలను చంద్రబాబు సర్కారు మోసం చేస్తున్న కారణంగా.24వ తేదీ రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్టు ప్రకటించారు…ఈ బంద్ లో ప్రజలు అంతా పాల్గొని బంద్ విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు.ఎక్కడికక్కడ బస్సులను, రహదారులను దిగ్బంధించాలని, చంద్రబాబుపై ఒత్తిడి తీసుకు రావాలని చంద్రబాబు ఆడే దొంగానాటకాలకి చరమ గీతం పాడాలని పిలుపు ఇచ్చారు

అంతేకాదు టీడీపీ ఎంపీలను రాజీనామాలు చేసేలా ప్రజలు ఒత్తిడి తీసుకుని రావాలని పిలుపు ఇచ్చారు.ఏ పార్టీ ప్రత్యేక హోదా మా మద్దతు ఆ పార్టీకే అంటూ మరో మారు జగన్ ప్రకటన.

మీ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి గెలిపించుకునే దమ్ము బాబు కు ఉందా అంటూ సవాల్ విసిరారు.అందరం కలిసి కూర్చుని నిరాహారదీక్ష చేస్తే అప్పుడు కేంద్రం తప్పకుండా దిగివస్తుందని అన్నారు.

ఏపీ ప్రజలు కేంద్రంపై ఆగ్రహంతో ఉన్నారన్న సంకేతాలు వెళతాయని జగన్ చెప్పారు…ప్రజల సెంటిమెంట్ ని గౌరవించే సంస్కారం ప్రభుత్వాలని ఉంది అంటూ ఫైర్ అయ్యారు జగన్ మొహన్ రెడ్డి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube