వారిలో ఒక్కరిని కూడా జగన్ గెలవనివ్వడట ... ఎవరు వారు..?

వైసీపీ అధ్యక్షుడు జగన్ లో కసి బాగా పెరిగినట్టు కనిపిస్తోంది.ఈ సారి రాబోయే ఎన్నికల్లో పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్న ఆయన అందుకోసం బాగానే కష్టపడుతున్నాడు.

 Ys Jagan Targets Party Changes Ysrcp Mlas-TeluguStop.com

పాదయాత్ర ద్వారా పార్టీకి ఊపు తీసుకొచ్చే పనిలో ఉన్నా జగన్ పాత గాయాలను మాత్రం ఇంకా మరిచిపోలేనట్టు కనిపిస్తున్నాడు.అందుకే గత ఎన్నికల్లో పార్టీ తరపున గెలిచి ఆ తరువాత టీడీపీ తాయిలాలు ఆశపడి పార్టీ ఫిరాయించిన ఎమ్యెలేలపై జగన్ గుర్రుగా ఉన్నాడు.

రాబోయే ఎన్నికల్లో వారికి తగిన బుద్ది చెప్పాలని చూస్తున్నాడు.విలువలకు, విశ్వసనీయతకు తాను అంత ప్రాధాన్యత ఇస్తే వారు మాత్రం డబ్బుకు ఆశపడి పార్టీ ఫిరాయించారు అనే కోపంలో జగన్ ఉన్నాడు.

గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందిన 22 మంది ఎమ్యెల్యేలు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆశ పెట్టిన తాయిలాలకు ,ప్రలోభాలకు లొంగి పసుపు కండువా కప్పుకున్నారనేది నగ్న సత్యం.ఎన్నో సార్ల్ వైసీపీ నేతలు కూడ విమర్శంచారు.అయిన వారి తీరు మారలేదు.తాజాగా పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఓ ఎమ్మెల్యేతో వచ్చే ఎన్నికల్లో మీరు ఏమీ భయపడకండి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము.

అన్ని నియోజక వర్గాల్లో వైసీపీ బలం పెరుగుతుందని చెప్పారంట.ఇంకా గత ఎన్నికల్లో మన పార్టీ తరుపున గెలిచి టీడీపీలో చేరిన 22 మందిలో ఒక్కరిని కూడ గెలవకుండా చెయ్యడమే తన లక్ష్యమని ఆయనతో జగన్ చెప్పాడని సమాచారం.

జగన్ పంతం చూస్తుంటే వారిమీద పీకల దాకా కోపం పెంచుకున్నట్టు కనిపిస్తోంది.అదీ కాకుండా ప్రస్తుత పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుని వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోకపోతే ఆ తరువాత పార్టీ మనుగడ కూడా కష్టమే అనే ఆలోచన జగన్ లో స్పష్టంగా కనిపిస్తోంది.

అందుకే ఎండ, వాన లెక్కజేయకుండా తన ప్రజాసంకల్ప యాత్ర కొనసాగిస్తూనే ఉన్నాడు.అదే సమయంలో పార్టీని బాలపోతం చేస్తూ తన లక్ష్యాన్ని చేరుకునే దిశగా జగన్ అడుగులు వేస్తున్నాడు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube