ఎంత కొడుకు అయితే మాత్రం మరీ ఇంత ఖర్చా

తెలుగు సినిమా అయినా మరే సినిమా అయినా కూడా బడ్జెట్‌ పరిధిలో ఉంటేనే సినిమా ఫ్లాప్‌ అయినా కూడా నిర్మాతకు భారీ నష్టాలు రావు.పెద్ద హీరోతో ఎంత బడ్జెట్‌ పెట్టినా కొన్ని సార్లు రివర్స్‌ అయ్యే అవకాశం ఉంటుంది.

 Naga Shourya Narthanasala Gets Big Budget-TeluguStop.com

అయితే కొన్ని సార్లు చిన్న బడ్జెట్‌ చిత్రాలు కూడా బడ్జెట్‌ను రికవరీ చేయలేవు.ఇక చిన్న హీరోల విషయంలో బడ్జెట్‌పై ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది.

చిన్న బడ్జెట్‌తోనే చిన్న హీరోల సినిమాలు చేయాలి.అలా కాదని భారీతనంకు పోతే నిర్మాత నెత్తిన గుడ్డ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

గతంలో పలు సందర్బాల్లో ఆ విషయం వెళ్లడి అయ్యింది.

ఏమాత్రం క్రేజ్‌ లేని హీరోతో రెండు మూడు కోట్లు పెట్టి సినిమా తీస్తే పర్వాలేదు, అదే అయిదు కోట్లకు మించి పెట్టి తీస్తే ఒకవేళ సినిమా సక్సెస్‌ అయితే ఆ అయిదు కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది.

లాభాల మాట దేవుడు ఎరుగు, ఇక ఫ్లాప్‌ అయితే అయిదుకు అయిదు కోట్లు కూడా నష్టపోవాల్సి వస్తుంది.ఈ విషయాన్ని గుర్తించి చిత్రాలను నిర్మించిన వారు మాత్రమే సక్సెస్‌లను దక్కించుకోగలరు, కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగగలరు.

ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్‌ ఉన్నా కూడా ఎక్కువ శాతం హీరోలు తమ స్థాయి బడ్జెట్‌లో సినిమాలు చేస్తూ ఉంటారు.ఇక ‘ఛలో’ చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకున్న నాగశౌర్య జోరు మీదున్నాడు.

‘ఛలో’ మూవీ సక్సెస్‌ అయినా కూడా వచ్చిన మొత్తం 15 కోట్లు.పెట్టుబడి 10 కోట్లకు అయిదు కోట్ల లాభం వచ్చింది.నాగశౌర్యపై అయిదు కోట్ల వరకు పెట్టడం చాలా ఎక్కువ.కాని కొడుకు కోసం ఛలో మూవీని ఏకంగా 10 కోట్లు పెట్టి నిర్మించింది.అది కాస్త సక్సెస్‌ అయ్యింది.ఇప్పుడు మళ్లీ అదే తరహా ప్రయత్నం చేస్తోంది.

కొడుకుతో ప్రస్తుతం నిర్మిస్తున్న చిత్రం ‘నర్తనశాల’కు నిర్మాత ఉషా ఏకంగా 15 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.ఏకంగా మూడు కోట్ల రూపాయలను ప్రమోషన్స్‌ కోసం ఉపయోగించాలనే నిర్ణయానికి వచ్చారు.

మొత్తంగా 15 కోట్లు నాగశౌర్య మూవీకి అంటే చాలా అంటే చాలా ఎక్కువ అన్నట్లే.

ఒక వేళ సినిమా ఫలితం తారు మారు అయితే ఖచ్చితంగా 10 కోట్ల నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.

అయినా కూడా కొడుకు కోసం అంత భారంను మోసేందుకు ఉషా సిద్దం అయ్యారు.షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున పబ్లిసిటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

స్టార్‌ హీరోల సినిమాలకు కూడా మొత్తంగా కోటి రూపాయలు కూడా పబ్లిసిటీకి చేయరు.కాని ఈ చిత్రంకు మాత్రం ఏకంగా మూడు కోట్లను కేటాయించారు.మరి ఇది ఏ తీరం చేరుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube