పోటీ సరే ! పవన్ కి ఇది గుర్తు ఉందా ..?

రాజకీయ దూకుడు పెంచి దూసుకుపోతున్న పవన్ ఈ మధ్యకాలంలో పార్టీలో చేరికలు ఎక్కువగా ఉండడంతో మంచి ఖుషీగా ఉన్నాడు.ఉత్తరాంధ్ర పర్యటన ఆ పార్టేకి మైలేజ్ ఇచ్చిందా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే.

 Pawan Kalyan Jana Sena Election Symbol1-TeluguStop.com

పవన్ కి మాత్రం సంతృప్తిని కలిగించింది.ఇదే ఉత్సాహంతో గోదావరి జైల్లో పర్యటనకు పవన్ సిద్ధం అవుతూ.

అసత్య్రాలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడు.ఇంతవరకు బాగానే ఉన్నా.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని స్థానాల్లోనూ పోటీ చేసేందుకు పవన్ మంచి ఉత్సాహం చూపిస్తున్నాడు.మెజార్టీ స్థానాలు గెలుచుకున్న .గెలుచుకోలేకపోయినా కింగ్ మేకర్ మాత్రం అవుతాను అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

అధికార పార్టీ మీద విమర్శలు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ ను భారీగా తన ఖాతాలో వేసుకోవాలని పవన్ హిస్తున్నాడు.

అయితే ఇదే సమయంలో , అసలైన కీలక అంశాన్ని పవన్ వదిలేసినట్టుగా కనిపిస్తోంది.మామూలుగా అయితే ఎన్నికలకు దాదాపుగా మరో 10 నెలల వరకు సమయం ఉంది గానీ, ముందస్తు ఎన్నికలకు వస్తే మాత్రం మరో అయిదు నెలల్లో అంతా సిద్ధం కావాల్సి ఉంది.

అందుకు జనసేన మాత్రం సిద్ధంగా ఉన్నట్టు కనిపించడంలేదు.పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా అయితే ఉంది.అన్ని స్థానాలకు అభ్యర్ధులు ఉన్నారో తెలియదు.కనీసం ఉన్న అభ్యర్ధులను గెలిపించుకోవడనికైనా పార్టీ గుర్తును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన అవసరం జనసేన కు ఉంది.

కానీ పార్టీ గుర్తు తెచ్చుకోవడంలో మాత్రం పవన్ ఇంకా నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నట్టు కనిపిస్తోంది.పార్టీకి కామన్ సింబల్ ను ఎలక్షన్ కమీషన్ ప్రకటించాల్సి ఉంటుంది, కానీ దానికి సంబంధించిన చర్యలన్నీ పార్టీ అధినేతే తీసుకోవాల్సి ఉంది.ఇప్పటివరకు పార్టీ గుర్తుపై పవన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.కనీసం తాము ఈసీకి అభ్యర్ధించామని కూడా పవన్ చెప్పలేదు.గతంలో ప్రజారాజ్యం విషయంలో కూడా చివరివరకు ఇదే సస్పెన్స్ కొనసాగడం పార్టీకి పెద్ద మైనస్ గా మారింది.

అటువంటి తప్పు జరగకుండా ముందుగానే పవన్ మేల్కొని పార్టీ గుర్తు తెచ్చుకునే పనిలో ఉంటే మంచిది .అది కనుక వస్తే ముందుగానే ఆ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా సులువు అవుతుంది.అంతే కానీ ఎన్నికల దగ్గర్లో గుర్తు తెచ్చుకుంటే గ్రామస్థాయి ఓటర్ల వరకు అది చేరేసరికి పుణ్యకాలం కాస్త అయిపోతుంది.

ఆ తరువాత లబోదిబో అని గోల చేసినా… ప్రయోజనం మాత్రం కనబడదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube