అతని కిడ్నీ కొట్టేయడానికి బంధువులు ఎలాంటి ప్లాన్ వేసారో తెలుసా.? అసలేమైందంటే.?

ఓ కుర్రాడి కిడ్నీని బంధువులే కొట్టేశారు.రక్తదానం పేరుతో ఆస్పత్రికి పిలిచి కిడ్నీ తీసుకున్నారు.

 Teenager Complains Of Kidney Theft In Madurai-TeluguStop.com

రక్తదానం కోసమని బంధువైన యువకుడిని తీసుకెళ్లాడు.అతడికి తెలియకుండానే కిడ్నీని అపహరించి తన కుమారుడికి అమర్చుకున్నాడు.

ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

మధురై జిల్లా ఒత్తకడైకి చెందిన షకీలా భాను తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది.

భర్త మరణంతో కూలి పనులు చేసుకుంటూ ఆమె కుటుంబ భారాన్ని మోస్తోంది.టెన్త్‌లో చదువు ఆపేసిన ఆమె పెద్ద కొడుకు ఫక్రుద్ధీన్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.మదురై సమీపం కొట్టాంపట్టికి చెందిన సమీప బంధువు రాజా మహమ్మద్‌ 2017 అక్టోబర్‌లో భషీర్‌ అహ్మద్‌ అనే వ్యక్తితో కలిసి ఇంటికి వచ్చాడు.2017 ఆగష్టులో షకీలా భాను బంధువులమంటూ కొందరు ఆమె ఇంటికి వచ్చారు.కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి చలించిపోయామని.సాయం చేస్తామని నమ్మబలికారు.వారికి ప్రతి నెలా సరుకులు కూడా అందజేస్తున్నారు.అప్పుడప్పుడు ఇంటికి వచ్చి యోగ క్షేమాలు తెలుసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఓ బంధువు అక్టోబరులో ఇంటికి వచ్చాడు.తన బంధువులు ఒకరు ఆస్పత్రిలో ఉన్నారని.వాళ్లకు రక్తదానం చేసేందుకు ఫక్రుద్ధీన్‌ను పంపించాలని కోరారు.కుటుంబాన్ని ఆదుకున్నారనే అభిమానంతో ఆమె కొడుకును పంపేందుకు ఒప్పుకుంది.ఫక్రుద్దీన్‌ రక్తంలో క్రిములు ఉన్నాయి, చికిత్స చేయాల్సి ఉందని నమ్మబలికి ఒక కాగితంపై సంతకం తీసుకెళ్లాడు.ఫక్రుద్దీన్‌ను నెలరోజులపాటు ఆస్పత్రిలోనే ఉండి ఇంటికి వచ్చిన మహ్మద్‌ ఫక్రుద్ధీన్‌ నడవలేక నీరసించి పోయాడు.

అనుమానంతో పరీక్షలు చేయించగా ఫక్రుద్ధీన్‌ కిడ్నీ అపహరణకు గురైనట్లు తెలుసుకున్నారు.

అతడి కిడ్నీని తొలగించారని చెప్పడంతో ఆమె షాకయ్యిది.

వెంటనే బంధువుల దగ్గరకు వెళ్లి నిలదీసింది.ఈ విషయాన్ని పెద్దది చేయొద్దని.

ఆర్థికంగా సాయం చేస్తామని బంధువులు చెప్పారు.కుటుంబ ఆర్థిక స్థితి సరిగా లేకపోవడంతో షకీలా వారి ప్రతిపాదనకు ఒప్పుకుంది.

కానీ చివరికి డబ్బు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారట.దీంతో బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube