లోకేష్ స్పీడు చూసి షాక్ అవుతున్న సీనియర్స్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన తరువాత.ఎన్నో విమర్శలు…మరెన్నో అవమానాలు.

 Lokesh Speedups His Activity In Tdp Campaign-TeluguStop.com

అప్పటి వరకూ కార్పోరేట్ సెక్టార్ లో ఉన్న లోకేష్ ఒక్క సారిగా రాజకీయాల్లోకి వచ్చే సరికి రాజకీయ ప్రత్యర్ధులు చేసే మాటల దాడులకి అప్పట్లో పార్టీ సీనియర్స్ లోకేష్ కి రక్షణ కవచంలా అడ్డుగా ఉండేవారు.ఎమ్మెల్సీ ఎన్నికల సమయమే లోకేష్ రాజకీయాల్లోకి రావడానికి సరైన సమయం అని భావించిన చంద్రబాబు ఆ సమయంలో లోకేష్ ని ఎమ్మెల్సీ గా చేసి ఆపై మంత్రిగా చేశారు.

అయితే ప్రమాణ స్వీకారం మొదలు లోకేష్ ఎప్పుడు ఎక్కడ ఏమి మాట్లాడినా సరే ఆ మాటల్లో తప్పులు వెదుకుతూ ఒకటికి రెండింతలు చేస్తూ ఇలాంటి వాడా మంత్రిగా ఉంది అంటూ వైసీపి వాళ్ళు చేసిన దుష్పరచారం అంతాఇంతా కాదు సోషల్ మీడియా నుంచీ వెబ్ మీడియా వరకూ కూడా లోకేష్ ని టార్గెట్ గా చేసుకుని ఎన్నో నిందలు వేశారు.అయితే లోకేష్ పై ఆరోపణలు చేసిన ప్రతీ సారి పార్టీలో సీనియర్స్ మాట్లాడటం లోకేష్ ఒక్క విషయంలో కూడా ఖండించక పోవడంతో పార్టీలోని కార్యకర్తలు సైతం నిరుశ్చహానికి లోనయ్యారు.

ఈ క్రమంలో లోకేష్ మెల్ల మెల్లగా పార్టీ పై పట్టు పెంచుకోవడమే కాకుండా వేదికలపై మాట్లాడే సమయంలో కాని ప్రసంగాలలో కాని పూర్తిస్థాయి పట్టు సంపాదించుకున్నాడు.అంతేకాదు.

వైసీపి వాళ్ళు చేసే విమర్సలని తిప్పి కొట్టడంలో వారికి దీటుగా సమాధానం చెప్పడంలో గానీ లోకేష్ తన దిన ఫన్దాలో దూసుకుపోతున్నాడు.అయితే ఈ పరిణామాలు చూస్తున్న పార్టీ సీనియర్ లీడర్స్ కి దిమ్మతిరిగిపోయిందట.

అంతేకాదు అసలు విషయం ఏమిటంటే.

చంద్రబాబు తప్ప మోడీ పై తీవ్రస్థాయిలో విర్చుకుపడిన నేతలు టీడీపీ లో తక్కువే అయితే లోకేష్ తాజాగా మోడీ ని సైతం హెచ్చరించి విమర్శలు సవాల్ విసరడం తో లోకేష్ డేరింగ్ చూసి సీనియర్ లీడర్స్ షాక్ తిన్నారట.

రాజకీయాలలోకి వచ్చిన అంతటి కాలలోనే లోకేష్ ఇంతగా రాటుదేలడం మామూలు విషయం కాదని ముక్కు మీద వేలేసుకుంటున్నారు నేతలు.అంతేనా ఈ మధ్య లోకేష్ దూకుడు బాగా పెంచాడు బీజేపి నేతలు టార్గెట్ గా టీడీపీ పై కామెంట్స్ చేస్తున్న వారికి వరుసపెట్టి సవాలు విసురుతూ అందరినీ విస్మయానికి గురిచేస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube