పోలీస్ అవ్వడానికి హైట్ తక్కువ ఉన్నాడని..ఫిసికల్ టెస్ట్ లో అతను ఏం చేసాడో తెలుసా? కానీ చివరికి!

పోలీసు ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం అని అందరికి తెలిసందే.ఫ్లాన్‌ వేసి అధికారులను బురిడీ కొట్టించాలనుకున్నాడు.

 Henna Act How This Man Tried To Trick Up Police-TeluguStop.com

అయితే ఫిజికల్‌ టెస్టులో అతగాడి వ్యవహారం బయటపడింది.ప్లాన్ మొత్తం బోల్తా కొట్టింది.

వివరాలలోకి వెళ్తే.!

అంకిత్ కుమార్.ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన ఈ కుర్రాడికి చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలన్నది కల.అందుకోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నాడు.తాజాగా ఎస్సై ఉద్యోగాల కోసం విడుదలైన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు.రాత పరీక్షను విజయవంతంగా ముగించగా.ఫిజికల్ టెస్టులు మిగిలి ఉన్నాయి.అయితే ఎత్తు సమస్య అతని పాలిట శాపంగా మారింది.

నిబంధనల ప్రకారం 168 ఎత్తు కాగా, అంకిత్‌ ఓ సెంటీమీటర్‌ తక్కువగా ఉన్నాడు.దీంతో ఎత్తు పెరిగేందుకు అడ్డమైన మందులు వాడాడు.

ఫిజికల్‌ ఎక్సర్‌సైజ్‌లు చేశాడు.అయినా లాభం లేకుండా పోయింది.

దీంతో ఓ ఫ్లాన్‌ వేశాడు.

జుట్టులో హెన్నా పెట్టుకుని టెస్టులకు హాజరయ్యాడు.

అన్ని టెస్టులు పూర్తి చేసి.చివరకు ఎత్తు కొలిచే సమయంలో మెషీన్ మెటాలిక్ ప్లేట్‌కు, జుట్టుకు గ్యాప్ ఉండటం అక్కడి అధికారులకు అనుమానం తెప్పించింది.

దీంతో అతన్ని పక్కకు తీసుకెళ్లి తనిఖీ చేయగా.జుట్టులో పెట్టిన హెన్నా బయటపడింది.

దానిని తొలగించి నిల్చోవాలని అధికారులు ఆదేశించారు.తిరిగి ఎత్తు కొలవగా ఒక సెంటీమీటర్‌ తక్కువ హైట్‌ వచ్చింది.

దీంతో అధికారులు అతన్ని అనర్హుడిగా ప్రకటించారు.అంతేకాదు రిక్రూట్‌మెంట్‌లో మోసానికి యత్నించినందుకుగానూ ఐపీసీ సెక్షన్‌ 420 ప్రకారం అతనిపై కేసు నమోదు చేసినట్లు మీరట్‌ ఎస్పీ(ట్రాఫిక్‌), ఫిజికల్‌ టెస్టుల పర్యవేక్షకుడు సంజీవ్‌ బాజ్‌పాయి వెల్లడించారు.

‘నా ఎత్తు తక్కువ.అది కేవలం 1 సెం.మీ.మాత్రమే.అది పెరిగేందుకు చాలా యత్నించా.కానీ, వీలు పడలేదు.అలాగని అధికారులు మినహాయింపు ఇవ్వరు కదా!.రాత పరీక్ష క్వాలిఫై అయిన నేను ఈ అవకాశం ఎందుకు వదులుకోవాలని భావించా.

నేను చేసింది తప్పే.కానీ, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఇలా చేశా.

దయచేసి అవకాశం ఇవ్వండి’ అని 24 ఏళ్ల అంకిత్‌ ప్రాధేయపడుతున్నాడు.అంకిత్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube