సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టె శక్తివంతమైన ఆహారాలు

సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టె శక్తివంతమైన ఆహారాలు

సీజన్ మారినప్పుడు దగ్గు,జలుబు,జ్వరం వంటివి రావటం సహజమే.ఇలా సీజన్ మారినప్పుడు శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గటం వలన వస్తూ ఉంటాయి.

 Seasonal Diseases, Immune System, Honey, Turmeric, Coconut Oil-TeluguStop.com

ఆలా రాకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తి కలిగిన ఆహారాలను తీసుకోవాలి.ఇప్పుడు చెప్పే కొన్ని ఆహారాలను తీసుకుంటే రోగనిరోధక శక్తి పటిష్టంగా ఉండి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.ఇప్పుడు ఆ ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.

కొబ్బరినూనె

కొబ్బరినూనెలో మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

తేనే

తేనెలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన ఇన్ ఫెక్షన్స్ రాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనే కలిపి త్రాగితే మంచి ఫలితం ఉంటుంది.

పసుపు

పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో పావు స్పూన్ పసుపు వేసుకొని త్రాగితే సీజనల్ వ్యాధులు రావు.

అనాస పండు

ఇందులో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి.ఇవి రోగాలు రాకుండా చూస్తాయి.

రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.ఈ సీజన్‌లో పైనాపిల్‌ను తరచూ తింటుంటే వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube