ఏపీ పాలిటిక్స్‌లో ఆ ముగ్గురి కుమ్మ‌క్కు పాలిటిక్స్‌

ఏపీకి ప్ర‌త్యేక హోదా క్రెడిట్ గేమ్‌లో మూడు పార్టీలు కుమ్మ‌క్కు అయ్యాయా.? రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌క్క‌న బెట్టి కేవలం చంద్ర‌బాబునే టార్గెట్‌ చేశాయా.? వ‌చ్చే ఎన్నిక‌ల్లో వేర్వేరుగా బ‌రిలోకి దిగితే బాబు ముందు ఓడిపోతామ‌నే ఆలోచ‌న‌కు వ‌చ్చాయా.? అంటే తాజా ప‌రిణామాలు మాత్రం నిజ‌మేన‌ని చెబుతున్నాయి.టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఎదుర్కొనేందుకు బీజేపీ, వైసీపీ, జ‌న‌సేన‌లు ర‌హ‌స్య ఒప్పందానికి దిగి ఉండ‌వ‌చ్చున‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.తిరుప‌తి మాజీ ఎంపీ, వైసీపీ నేత వ‌ర‌ప్ర‌సాద్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆ మూడు పార్టీల మ‌ధ్య ఉన్న అవ‌గాహ‌న‌ను ప్ర‌జ‌ల ముందు ఉంచుతున్నాయి.

 Ysrcp Bjp And John Cena Merge Politics For Ap Special Status-TeluguStop.com

రానున్న ఎన్నిక‌ల్లో జ‌నసేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వైసీపీకి మ‌ద్ద‌తు తెలిపే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న చెప్ప‌డంలో ఆంత‌ర్య‌మిదేన‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

బీజేపీ, వైసీపీ, జ‌న‌సేనల మ‌ధ్య అవ‌గాహ‌న కుద‌రింద‌ని చెప్ప‌డానికి అనేక అంశాలు ఉన్నాయ‌ని చెప్పొచ్చు.రెండు నెల‌ల కింద‌ట విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన కేంద్ర మంత్రి రాందాస్ అథ‌వాలె మాట్లాడుతూ.ఏపీలో జ‌గ‌న్ బ‌లమైన నాయ‌కుడంటూ పొగిడారు.

ఇదే స‌మ‌యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా న‌మ్మ‌క‌ద్రోహం చేసిన బీజేపీని, ప్ర‌ధాని మోడీని క‌నీసం మారుమాట కూడా అన‌కుండా జ‌గ‌న్ ఉంటున్నారు.హోదా కోసం పోరాడుతున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై మాత్రం తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.

టీడీపీకి వ్య‌తిరేకంగా వైసీపీ నేత‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం.అంతేగాకుండా.

ఆ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌ధాని కార్యాల‌యం చుట్టూ చ‌క్క‌ర్లు కొట్ట‌డం.ఏకంగా స‌భ‌లో ప్ర‌ధాని మోడీ కాళ్లు మొక్క‌డం గ‌మ‌నార్హం.

ఇవ్వ‌న్నీ కూడా బీజేపీ, వైసీపీల అవ‌గాహ‌నకు నిద‌ర్శ‌నాలేన‌నే టాక్ ఉంది.

ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ది ప్ర‌త్యేక‌మైన ప‌రిస్థితిగా కనిపిస్తోంది.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఎందుకివ్వ‌డం లేద‌ని బీజేపీని, మోడీని ప్ర‌శ్నించ‌డ‌కుండా.రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని నిందించ‌డం ఆయ‌న ప‌నిగా పెట్టుకున్నారు.

ఉత్త‌రాంధ్ర‌లో ప్ర‌జాపోరాట యాత్ర చేప‌ట్టిన సంద‌ర్భంలోనూ ఆయ‌న ఎక్క‌డ కూడా కేంద్రాన్ని నిందించింది లేదు.చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ ఆయ‌న ముందుకు వెళ్తారు.

అయితే.వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందిన త‌ర్వాత వ‌ర‌ప్ర‌సాద్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌క‌ళ్యాన్ వైసీపీకి మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశం ఉంద‌నీ, ఇదే విష‌యాన్ని ప‌వ‌న్ త‌న‌తో చెప్పార‌నీ వ‌ర‌ప్ర‌సాద్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.చంద్ర‌బాబుకు మ‌ద్ద‌త ఇవ్వ‌న‌నీ, జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు తెలుపుతాన‌నీ ప‌వ‌న్ గ‌తంలో త‌న‌కు చెప్పార‌ని పేర్కొన్నారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే ఒక కేంద్రం క‌నుస‌న్న‌ల్లో రాష్ట్ర బీజేపీ, వైసీపీ, జ‌న‌సేన‌లు ముందుకు క‌దులుతున్న‌ట్లు స‌మాచారం.ఇదే విష‌యాన్ని టీడీపీ వ‌ర్గాలు కూడా ప్ర‌స్తావిస్తున్నాయి.టీడీపీ ఓడించేందుకు ఆ మూడు పార్టీలు కుట్ర రాజ‌కీయాల‌కు తెర‌లేపుతున్నాయ‌ని ఆరోఫ‌ణ‌లు చేస్తున్నాయి.అయితే వ‌ర‌ప్ర‌సాద్ వ్యాఖ్య‌ల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏలా స్పందిస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

మ‌రోవైపు ప్ర‌త్యేక హోదా కోసం, క‌డ‌ప‌లో ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం ఉద్య‌మిస్తున్న టీడీపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా.రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను ద‌`ష్టిలో పెట్టుకుని వైసీపీ నేత‌లు మాట్లాడ‌డంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డుతున్నాయి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube