ఏపీలో హీట్ పుట్టిస్తున్నరాజకీయం...మేధావులకి అర్థం కాని బీజేపి వ్యూహాలు...

ఏపీలో రాజకీయాలు చూస్తుంటే సామాన్యుడి కి బుర్ర హీట్ ఎక్కిపోతోంది.చోటా మోటా రాజకీయ నేతలకి జుట్లు పీక్కునే పరిస్థితి నెలకొంది…ఏ పార్టీ ఎవరితో జట్టు కడుతుంది అనే విషయం ఇప్పటికిప్పుడు ఎవరూ అంచనా వేయలేక పోతున్నారు.

 Bjp Different Politics In Ap-TeluguStop.com

మొన్నటి వరకూ ఏపీలో టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది.బీజేపి , వైసీపి, జనసేన కలిసి పోటీ చేస్తాయి.

చంద్రబాబు పని కేల్ ఖతం దుకాణ్ భంద్ అని అన్నారు.చంద్రబాబు ఇక రాజకీయాలకి సెలవు ప్రకటించడం మంచిది అనే వార్తలు హల్చల్ చేశాయి.

అయితే రాజకీయాల్లో ఏది ఎప్పుడు ఎలా .ఏ టైం లో జరుగుతుందో ఎవరి తెలియని పరిస్థితి అయితే ఇప్పుడు అదే జరిగింది.

ఏపీలో అసలు ఏపీలో ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి… బీజేపి , వైసీపి, జనసేన ఈ మూడు పార్టీలు కలిసి పని చేస్తాయి అనుకున్న తరుణంలో సీన్ రివర్స్ అవుతోంది.ఇప్పుడు బీజేపి పెద్దలు యూ టర్న్ తీసుకోబోతున్నారా అనే అనుమానాలకి బలం పెరుగుతోంది.చంద్రబాబు ఒంటరే అని అందరూ అనుకున్న సమయంలో ఎంతో మంది మేధావులు బాబు చివరి నిమిషంలో ఏదైనా చేయగల అపర చాణిక్యుడు అని అన్నారు నిజంగా బాబు ఎదో మాయ చేసే ఉంటారు అంటున్నారు మేధావులు బీజేపి నేతల స్వరంలో తేడా వచ్చింది అంటున్నారు.బీజేపి తెలుగుదేశం భంధం మరోసారి బలపడుతుందా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ సందేహాలకి బీజేపి నేతల ప్రవర్తన మాటలు మరింత అనుమానలకియా తావిస్తోంది.జగన్ శిబిరానికి ఘలక్ ఇస్తోంది…మొన్న నీతీ ఆయోగ్ భేటీలో భాగంగా చంద్రబాబు ఇతర నేతలు టీ విరామసమయంలో ఉండగా నేరుగా మోడీ వచ్చి బాబుతో ముచ్చటించడం.

అదే సమయంలో జరుగుతున్న మీటింగ్ లో చంద్రబాబు ని పొగడ్తలతో ముంచెత్తడం.బాబు పాలన బాగుంది అని చెప్పడం తో చంద్రబాబు స్కెచ్ లు అన్ని పక్కగా అమలు అవుతున్నాయి అని భావించారు మేధావులు.

అదేసమయంలో వైసీపిలో అందోళన నెలకొన్నా సరే పెద్దగా పట్టించుకోలేదు.అయితే తాజా ఘటనతో వైసీపికి గుండెల్లో రైళ్ళు పరిగేడుతున్నాయి.

ఏపీ బీజేపి ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజ్ టీడీపీ పై అనుకూలంగా మాట్లాడారు.చంద్రబాబు కి ఫేవర్ గా ఆయన మాట్లాడటం రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది.

ముఖ్యంగా వైసీపి అధినేత జగన్ కి నిద్రపట్టకుండా చేస్తోంది.ఇంతకీ విష్ణు కుమార్ రాజ్ ఏమన్నారంటే.

ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మర్యాదపూర్వకంగా కలిస్తే తప్పేమిటని… ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నేతలు పనిలేకుండా బాబుపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు…2019లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేది పార్టీ అధిష్టానం.

చూసుకొంటుందని ఆయన చెప్పారు…అంతేకాదు తమ పార్టీ ఎంపీ జీవీఎల్ పై కూడా విష్ణు విమర్శలు చేశారు.ఏపీలో చంద్రబాబునాయుడు పులి, ఢిల్లీలో పిల్లి అంటూ బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు చేసిన విమర్శలు సరైనవి కావని ఆయన చెప్పారు.

ఈ పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తులో బీజేపి ,టీడీపీ మళ్ళీ కలవనున్నాయ్ అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube