టిఫిన్ గా ఇడ్లీ, దోశ, వడ తింటున్నారా.? అయితే ఆ వ్యాధి భారిన పడక తప్పదు.!

మూడు పూటలూ అన్నం తింటే లావవుతాం.కాబట్టి ఉదయం రాత్రికి టిఫిన్స్ చేసామనుకో కొంతలో కొంత అయిన పెరిగిన బరువు తగ్గించుకోవచ్చు.

 Idli Dosa Vada Effects Of Morning Breakfast-TeluguStop.com

చాలామంది బరువు తగ్గడానికి అనుసరించే విధానం ఇదే.కొందరు పొద్దస్తమానం టీ,కాఫీల మీదనే ఆధారపడతారు.దాని ద్వారా ఆకలి చచ్చిపోయి తినడం తగ్గించి బరువుతగ్గాలనే ఆలోచన కొందరిది.కానీ టీ,టిఫిన్స్ వలన మీకు తెలియకుండానే మీ శరీరానికి పెద్ద నష్టం చేసుకుంటున్నారు.ఇడ్లీ,దోస,వడ లాంటి టిఫిన్స్ డెయిలి తినడం వలన జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.

పాత కాలంలో మన పెద్దలు అయితే పొద్దుగాల్నే శరీరానికి మంచి పోషకాలను, కండ పుష్టిని ఇచ్చే ఆహారాన్ని తీసుకునేవారు.

అందులో పెరుగులో సద్దన్నం, జొన్న గటక, రాగి సంకటి వంటివెన్నో పోషకాల పరంగా వెలకట్టలేని ఆహారాలున్నాయి.ఇక ఆ తర్వాత అందరూ మూడు పూటలా అన్నం తినడం అలవాటైంది.

ఇప్పుడు ఉదయాన్నే టిఫిన్లు మధ్యాహ్నం అన్నం,రాత్రి కి అల్పాహారం పేరుతో మళ్లీ టిఫిన్లు తినడం చేస్తున్నారు.మిగతా టిఫిన్స్ తో పోలిస్తే ఇడ్లీ మంచిదే కానీ దీంట్లో సాంబారు, అల్లం చట్నీ, కారపొడి, నెయ్యి.

ఇలా అన్నింటిని కలిపి తినడం వల్ల కడుపులో ఎసిడిటీ పెరిగిపోతుంది.

అలాగే బియ్యం కంటే మినప్పప్పులో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి.ఇవి షుగర్ ను పెంచుతాయి.ఇలాప్రతిరోజూ టిఫిన్స్ తినడం వలన పేగులు తన శక్తిని కోల్పోతాయి.

అలాగే జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింటుంది.వాత వ్యాధులు కీళ్ల నొప్పులు లాంటివి వస్తాయి.

నిత్యం ఇడ్లీ, దోశ, వడ, పూరీ, పరోటా వంటి టిఫిన్లు దీర్ఘకాలంగా అంటే పది పదిహేనేళ్లుగా తింటున్న వారికి షుగర్ వ్యాధి వచ్చేస్తోందట.కాబట్టి వారానికి ఒకటి రెండు సార్లకే టిఫిన్స్ ని పరిమితం చేయాలి.

ఉదయం వేళ పెరుగన్నం, ఇంకా రాత్రి మిగిల్చిన అన్నాన్ని పెరుగులో కలిపి పెట్టుకుని మార్నింగ్ తినడం, లేదంటే మొలకెత్తిన గింజలు, పండ్లు, ఖర్జూరాలు వంటివి తినడం అలవాటు చేసుకుంటే కొద్ది రోజుల్లోనే మీ ఆరోగ్యంలో అనూహ్యమైన మార్పును గమనించొచ్చు.అలాగే మద్యాహ్నానికి బిర్రుగా కడుపునిండా తినాలి.కొంతమంది ఉపవాసం పేరుతో రాత్రి వేళ అన్నం మానివేస్తారు.అటువంటి అలవాట్లు ఉన్నవాళ్లు తిరిగి ఆ సమయంలో ఇడ్లీ, దోశ, బోండాలు, చపాతి, పరోటాలు వంటివి లాగిస్తుంటారు.

కాని అలా చేయడం వల్ల సాధారణంగా అన్నం తిన్నదానికంటే ఎక్కువే శరీరానికి నష్టం.అలాగే నైట్ కూడా తేలికగా తినడం వలన ఆరోగ్యంగా ఉంటారట.మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube