భారతీయులని ఊరిస్తున్న “ గ్రీన్ కార్డ్ ”

భారాత్ నుంచీ ఎంతో మంది విదేశాలలో చదువుకుంటూ అక్కడే స్థిరపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.ముఖ్యంగా అన్ని దేశాలలో కంటే కూడా అమెరికా వంటి దేశంలో అత్యధిక శాతం మంది భారత ఎన్నారైలు అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు.

 Green Card Forindians-TeluguStop.com

అయితే అమెరికాలో శాస్వతంగా ఉండిపోవాలంటే మాత్రం ఆ దేశ నిభంధాలకి అనుగుణంగా ప్రతీ ఎన్నారై గ్రీన్ కార్డ్ కలిగి ఉండాలి.

ఈ గ్రీన్ కార్డ్ రావడం అనేది సాధారణం విషయం మాత్రం కాదు అయితే.సంవత్సరం క్రితం వరకూ కూడా ఈ గ్రీన్ కార్డ్ విషయంలో ట్రంప్ పెట్టిన వీసా నిబంధనల విషయంలో ఎంతో మంది భారతీయులు ఎన్నో అవస్థలు పడ్డారు అయితే తాజాగా హెచ్ -1బీ వీసాపై నిభంధనలు ఏమి ఉండవు అనే ప్రకటన వచ్చన తరువాత ఎంతో మంది ఊపిరి పీల్చుకున్నారు అయితే.గతంలో వీసా కలిగిన ఎన్నారైలు గ్రీన్ కార్డులకి దరకాస్తు చేసి ఉన్నారు.కాగా

గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న వారిలో అత్యధికులు భారతీయులేనని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) తాజాగా విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలిపింది.మే 2018 నాటికి సుమారు 3,95,025 మంది విదేశీయులు అమెరికాలో శాశ్వత నివాసమైన గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నారు.

వీరిలో మూడొంతులకు పైగా భారతీయులే ఉన్నారు…అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సుమారు 3,06,601 మంది భారతీయులు గ్రీన్‌కార్డు కోసం చూస్తున్నారు అంటూ ఒక నివేదికని విడుదల చేసింది అయితే భరత్ తరువాత ఆ స్థానంలో చైనా నిలిచి ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube