జాతీయ రాజకీయాలపై బాబు కి ఉన్న క్లారిటీ ఇదే !

జాతీయ రాజకీయాల అంశంలో ఎప్పుడేం చేస్తానో ప్రజలే చూస్తారని, జాతీయ రాజకీయాల పరిస్థితులు, పరిమితులు తనకు తెలుసని అన్నారు.దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు బలోపేతమవుతున్నాయని, ఆయా పార్టీలు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే సమయం దగ్గర్లోనే ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడుతున్నాడు.

 Chandrababu Clarity On Nationalpolitics-TeluguStop.com

రాబోయే ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ మరోసారి కీలకం అయ్యే ఛాన్స్ కనిపిస్తోందని బాబు ఆలోచన.2019 ఎన్నికల తరువాత, పరిస్థితులన్నీ అనుకూలిస్తే టీడీపీకి మరోసారి చక్రం తిప్పే అవకాశం వస్తుందనీ, ప్రయత్నిస్తే చంద్రబాబు ప్రధానమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని, అసలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను పరిగణలోకి తీసుకుంటే బాబు ని మించిన సమర్ధవంతమైన నేత లేరని అభిప్రాయం టీడీపీ నాయకులు వ్యక్తంచేస్తున్నారు.

మొన్న జరిగిన మహానాడులో కూడా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇదే అంశాన్ని లేవనెత్తాడు.
బాబు కూడా .జాతీయ రాజకీయాలపై ఒక స్ప్రష్టమైన ఆలోచనతోనే ఉన్నట్టు తెలుస్తోంది.దేశ రాజకీయాల్లో ఎప్పుడు ఏం చెయ్యాలో తనకు అవగాహన ఉందన్నారు .అందరి మాదిరిగా తానూ కుప్పిగంతులు వేస్తే అర్థమేముందన్నారు.తానేం చేసినా ఒక పద్ధతిగా ఉంటుందన్నారు.

దేశంలోని రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేస్తున్న వ్యక్తిగా, అనేక సందర్భాల్లో భాగస్వామ్యమైన వ్యక్తినని గుర్తు పెట్టుకోవాలన్నారు.

తొందరపడి ఏదిపడితే అది చెయ్యడం తనకు అలవాటు లేదని.

ఏమి చేసినా దానికి ఒక పద్ధతి ఉంటుందని జాతీయ రాజకీయాల్లో ఉండే సాధ్యాసాధ్యాలు కూడా తనకు బాగా తెలుసునన్నారు.అందుకే, నేషనల్ ఫ్రెంట్ పెడతా, యునైటెడ్ ఫ్రెంట్ పెడతా, నేనే ప్రధాని అవుతా అంటే ఏమౌతుందీ.

జరిగేదేంటీ అని వ్యాఖ్యానించారు.ఇప్పుడు అధికారం లో ఉన్న బీజేపీ ని ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితులు లేవని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ చతికలపడడం ఖాయమే అని బాబు చెప్తున్నారు.

మొన్న ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలు అవ్వడం దీనికి నిదర్శనం అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube