రాబోయే ఎన్నికల్లో ఏ కులం సపోర్ట్ ఎవరికో తెలుసా ..?

ఒక రాజకీయ పార్టీ ప్రజా క్షేత్రంలో నిలబడి అధికారం చేపట్టాలంటే … డబ్బుతో పాటు కులాల సపోర్ట్ కూడా చాలా ముఖ్యం.పైకి ఎవరెన్ని కబుర్లు చెప్పినా .

 2019 Caste Politics-TeluguStop.com

కులాల మద్దతు కోసం ప్రతి పార్టీ ప్రయత్నిస్తూనే ఉంటాయి.నాయకులూ మాత్రం అబ్బబ్బే మాకు కుల ఫీలింగులు లేనే లేవు .అటువంటి రాజకీయం మేం చేయబోము అంటూ నీతి కబుర్లు చెప్తూ ఉంటారు.ఇక ప్రజలు కూడా కుల రాజకీయాలకు బాగానే అలవాటుపడిపోయారు.

రెడ్డి కులస్థుల్లో ఎక్కువ మంది జగన్‌కి మద్దతు పలుకుతున్నారన్నది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం.ఇక చంద్రబాబు కమ్మల కోసం.కమ్మల మద్దతుతోనే నాయకుడిగా చెలామణి అవుతున్నాడు.మీడియాలోనూ, సినిమా ఫీల్డ్‌లోనూ, పాలిటిక్స్‌లోనూ, బిజినెస్‌లోనూ ఉన్న కమ్మల్లో చాలా మంది వారి వారి ప్రయోజనాల కోసం బాబును గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

కొత్తగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన పవన్ కూడా తాజాగా కుల రాజకీయాలు బాగానే ఒంటపట్టించుకున్నాడు.కర్ణాటక ఎన్నికల తర్వాత నుంచీ మొత్తం రాష్ట్రం కంటే తన వర్గం జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రపై ఎక్కువ దృష్టిపెట్టాడు పవన్.

అనుకూ ముందు అనంతపురం నుంచి పోటీ చేస్తానన్న పవన్.తాను చేయించుకున్న సొంత సర్వేల్లోనే ఓడిపోయే అవకాశం ఉంది అని తేలడంతో ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తాను అంటూ ప్లేట్ ఫిరాయించేసాడు.

గత ఎన్నికల్లో తాను స్వయంగా మద్దతివ్వడమే కాకుండా కాపుల చేత కూడా చంద్రబాబుకు మద్దతు ఇప్పించిన పవన్ ఈ సారి 2019 ఎన్నికల్లో మాత్రం బాబు ఓట్లను పూర్తిగా లాగేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.ఇక బ్రాహ్మణులను కూడా పూర్తిగా దూరం చేసుకున్నాడు చంద్రబాబు.

బీసీలు, కమ్మ కులస్తులే ఇప్పుడు బాబు ని నమ్మేది.ఇక ప్రతిపక్ష నేత జగన్‌కి రెడ్లతో పాటు ఎస్సీ, ఎస్టీలు, మస్లిముల మద్దతు బలంగా ఉంది.2019 ఎన్నికల్లో జగన్‌కి మద్దతివ్వాలని తాజాగా బ్రాహ్మణులందరూ నిర్ణయం తీసేసుకున్నారు.

ఈ సారి బీసీల్లో కూడా జగన్ పట్టు పెరిగే అవకాశం ఉందని సీనియర్ జర్నలిస్ట్ ల సర్వే తేల్చిచెప్తోంది.

ఈ నేపథ్యంలో కేవలం సొంత కులంతో పాటు బీసీలను నమ్ముకుని రంగంలోకి దిగుతున్న చంద్రబాబు, కాపులకు మాత్రమే నాయకుడిగా నిలబడిపోయే అవకాశమున్న పవన్ కంటే రెడ్లతో పాటు ఎస్సీ, ఎస్టీలు, ముస్లిముల్లో ఎక్కువ శాతం ఓట్లు కొల్లగొట్టడంతో పాటు బీసీలు, కాపుల ఓట్లు కూడా ఎంతో కొంత తనవైపుకు తిప్పుకోగలిగే అవకాశం ఉన్న జగన్‌ని ఎదుర్కోవడం బాబు, పవన్‌లకు ఈ సారి అసాధ్యం అని ఈ కులసమీకరణాల సర్వే చెప్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube