నిస్తేజంగా మారిన చర్మం ప్రకాశవంతంగా మారాలంటే....బెస్ట్ ఆహారాలు

చర్మం నిస్తేజంగా,డల్ గా ఉంటే కాస్త చికాకుగానే ఉంటుంది.చర్మం ప్రకాశవంతంగా మారటానికి ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటాం .

 Diet For Glowing Skin And Fair Skin-TeluguStop.com

దానికి కోసం ఎంత ఖర్చు పెట్టటానికి అయిన రెడీ అయ్యిపోతు ఉంటాం.అయితే మనకు అందుబాటులో ఉండే కొన్ని ఆహారాలను తీసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారటమే కాకుండా ముడతలు.

వయస్సు రీత్యా వచ్చే సమస్యలు అన్ని తగ్గిపోతాయి.ఇప్పుడు ఆ ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం

బ్రోకలీ

బ్రోకలీలో విటమిన్ A, విటమిన్ C సమృద్ధిగా ఉండుట వలన చర్మం కాంతివంతంగా మారటమే కాకుండా చర్మానికి రక్షణను ఇస్తుంది.బ్రోకలీలో ఉండే విటమిన్ A UV కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.విటమిన్ C చర్మంలో కొల్లాజెన్ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ లో విటమిన్లు A, E లు ఉండుట వలన చర్మంపై మేజిక్ చేస్తుందని చెప్పవచ్చు.

ఇది చర్మాన్ని తేమగా,మృదువుగా ఉంచటానికి సహాయపడుతుంది.అంతేకాక చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ బారి నుండి కాపాడుతుంది

ద్రాక్ష

ద్రాక్షలో ఉండే లైకోపీన్ చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.విటమిన్ C ఫ్రీ రాడికల్స్ బారి నుండి చర్మాన్ని రక్షిస్తుంది.దాంతో చర్మం ఆరోగ్యంగా,కాంతివంతంగా ఉంటుంది

పాలకూర

పాలకూరలో దాగి ఉన్న పోషకాలు చర్మ సంరక్షణలో బాగా సహాయపడతాయి.

చర్మ కాంతిని మెరుగుపరచటమే కాకుండా వృద్దాప్య లక్షణాలను ఆలస్యం చేయటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube