జేడీ పొలిటికల్ ఎంట్రీ షురూ..ఏ పార్టీలోకో తెలిస్తే షాక్ అవుతారు

గత కొంతకాలంగా సీబీఐ మాజీ జేడీ పొలిటికల్ ఎంట్రీ పై రకరకాల రూమర్స్ వచ్చాయి.జేడీ కొత్త పార్టీ పెట్టబోతున్నారని కొంతమంది లేదు లేదు జేడీ పార్టీ పెట్టారు ఉద్యమ నాయకుడుగా ఉంటారని మరో కొంతమంది.

 Jd Political Entry Fix-TeluguStop.com

అసలు జేడీ వెనుక ఉంది నడిపించేది బీజేపి అంటూ మరొకొందరు ఇలా ఒకరికొకరు పొంతనలేని వ్యాఖ్యలు ఏవో చేస్తూ తెగ హడావిడి చేస్తున్నారుఅ అయితే జేడీ మాత్రం ముందు నుంచీ తాను ఏ పార్టీలోకి వెళ్ళాలని అనుకోవడం లేదని అయితే భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటిస్తానని ఎప్పటి కప్పుడు చెప్తున్నారు జేడీ.

రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలలో తన పర్యటన ఉంటుదని బడుగు బలహీన వర్గాలని కలుస్తూ వారి భాదల పై వాటి పరిష్కారాలపై ఒక నిర్ణయానికి వస్తానని అయితే రెండు నెలలో తన భవిష్యత్తు ప్రణాళిక మీడియా సాక్షిగా తెలుపుతానని నిన్న జేడీ ఒక కార్యక్రమంలో తెలిపారు.అయితే ఈ క్రమంలోనే జేడీ మధ్య మధ్యలో ప్రత్యేక హోదా పై కీలక ప్రకటనలు కూడా చేశారు.హోదా అంశం అనేది కేంద్రం ఇచ్చి తీరాల్సిన అంశం అది ఏపీ హక్కు ఒక వేళ కేంద్రం ఇవ్వని పక్షంలో పోరాటానికి అయినా సరే సిద్దం అని ప్రకటించారు.అయితే

ప్రస్తుత పరిస్థితులకి జరుగుతున్నా పరిణామాల దృష్ట్యా జేడీ తెలుగుదేశం పార్టీ లోకి వెళ్తారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.అది కూడా ఎందుకంటే ప్రత్యేక హోదా అంశం ముందుగా ఎత్తుకుంది మేమే అంటూ ప్రకటించుకున్న వైసీపి ఇప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది.

పవన్ కళ్యాణ్ పెట్టిన హోదా కమిటీ సైతం గాలిలో కలిసి పోయింది అంటే ఇప్పుడు జనసేన రెండు పార్టీలు హోదా విషయంలో చేతులు ఎత్తేసినట్టే.ఇక ఒకే ఒక్క పార్టీ హోదా విషయంలో ఇప్పటికీ పోరాడుతూనే ఉంది అదే తెలుగుదేశం పార్టీ.

తెలుగుదేశం పార్టీ లోకి జేడీ వెళ్తారు అనడానికి కారణం ఒక్కటే అవినీతి మచ్చలేదు.చంద్రబాబు సుదీర్ఘమైన అనుభవం పట్టుదల.

మచ్చలేని రాజకీయ జీవితం ఇవన్నీ జేడీ ని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేలా చేస్తాయని అంటున్నారు విశ్లేషకులు.ఎందుకంటే ఇప్పటికిప్పుడు జేడీ పార్టీ పెట్టే అవకాశం లేదు.

అంతేకాదు ఉద్యమ నాయకుడిగా ఉండాలన్నా సరే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలన్నా అందుకు తగ్గ పరిస్తితిలేదు ఇప్పటికే హోదా విషయంలో టీడీపీ అలుపులేని పోరాటం చేస్తోంది.సో ఏ రకంగా చూసుకున్నా సరే జేడీ తెలుగుదేశం లోకి వెళ్ళడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో ఎప్పుడు ఎలా ఉంటాడో కూడా తెలియని అయోమయం పార్టీలో చేరుతాడనే నమ్మకం లేదని అంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే జనసేనకి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కానీ.దీర్ఘకాలిక వ్యూహాలు పార్టీని ముందుకు తీసుకెళ్ళే నాయకత్వం రెండూ లేవు.

ఉద్యోగం పట్ల ఎంతో నిబద్దతతో పని చేసే జేడీ ఉద్యోగానికి విరమణ ఇచ్చి మరీ ప్రజా సేవలోకి వెళ్తుంటే మరి ఇంకెంత ఆలోచించాలి.సో ఇక జేడీ కి మిగిలిన ఒకే ఒక్క చాయిస్ తెలుగుదేశం పార్టీ మాత్రమే నని అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube