మంత్రి గంటా వ‌ర్సెస్‌.. ఎంపీ అవంతి.. టికెట్ కోస‌మే!

ఏపీ అధికార పార్టీలో టికెట్ల రాజుకుని మంట‌లు పైకి లేస్తున్నాయి! నిన్న మొన్న‌టి వ‌ర‌కు క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ సీటు కోసం మంత్రి అఖిల ప్రియ‌, టీడీపీ సీనియ‌ర్ నేత‌, దివంగ‌త భూమా అనుచ‌రుడు ఏవీ సుబ్బారెడ్డిల మ‌ధ్య త‌లెత్తిన వివాదం స‌ర్దు మ‌ణ‌గ‌డం త‌ల‌ప్రాణం తోక‌కు తెచ్చిన‌ట్ట‌యింది.ఇది స‌ర్దు మ‌ణిగిందిలే అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఊపిరి పీల్చుకునే స‌రికి.

 Avanthi Srinivas Verses Ganta Srinivas-TeluguStop.com

ఇప్పుడు విశాఖ కేంద్రంగా మ‌రో వివాదం తెర‌మీదికి వ‌చ్చింది.ఇక్క‌డ కూడా టికెట్ వివాద‌మే ప్ర‌ధాన ఇష్యూ కావ‌డం గ‌మ‌నార్హం.

అది కూడా మంత్రి వ‌ర్సెస్ ఎంపీ కావ‌డం మ‌రింత ఆస‌క్తిక‌రం.మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉండ‌డంతో టీడీపీలో టికెట్ల గోల ఎక్కువైంది.

ఎక్క‌డిక‌క్క‌డ నేత‌లు త‌మ టికెట్ల కోసం ముందుగానే క‌ర్చీఫ్‌లు వేసుకునే ప‌రిస్థితి వ‌చ్చింది.

దీంతో నేత‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు టికెట్ ల‌భిస్తుందో లేదోన‌నే బెంగ‌తో కొంత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.తాజాగా ఇదే ప‌రిస్థితి విశాఖ‌లోనూ చోటు చేసుకుంది.అన‌కాప‌ల్లి ఎంపీ ముత్తంశెట్టి(అవంతి) శ్రీనివాస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని ఎప్ప‌టి నుంచో భావిస్తున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ అధికారంలోకి వ‌స్తే.ఏదో విధంగా తిప్ప‌లు ప‌డి మంత్రి ప‌ద‌వి ప‌ట్టాల‌ని ఈయ‌న ప్లాన్‌.

అయితే, విశాఖ మొత్తంలో త‌న‌కు అనుకూలంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం భీమిలి.గ‌తంలో అవంతి ఇక్క‌డ పోటీచేయ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని ఆయ‌న భావించారు.

అయితే, ఇక్క‌డ నుంచి ప్ర‌స్తుతం మంత్రి గంటా శ్రీనివాస‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.దఅంతేకాదు, వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ నుంచి గంటానే ప్రాతినిధ్యం వ‌హించ‌నున్నారనే వ్యాఖ్య‌లు త‌ర‌చుగా వినిపిస్తున్నాయి.

మంత్రిగా తాను బిజీగా ఉన్నా.నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టుకోల్పో కుండా గంటా త‌న‌కుమారుడు, మేన‌ల్లుడిని నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా తిప్పుతున్నారు.

దీంతో అవంతికి అవ‌కాశం క‌ష్ట‌మేన‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

దీంతో ఒకింత మ‌న‌స్థాపానికి గురైన అవంతి ఏదో విధంగా భీమిలిలో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే మంత్రి గంటాతో ఆయ‌న విభేదిస్తున్నారు.వాస్త‌వానికి ఈ ఇద్ద‌రూ మంచి స్నేహితులు.

అయితే, ఇప్పుడు మాత్రం అవంతి.మంత్రి గంటాతో విభేదిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే విశాఖ రైల్వేజోన్ కోసం రైల్వేస్టేష‌న్‌లో ఎంపీ అవంతి శ్రీనివాస్ ఒక‌రోజు దీక్ష‌కు దిగారు.ఇదే టైమ్‌లో రైల్వేజోన్ కోసం నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు అంటూ మంత్రి గంటా స‌మావేశం ఏర్పాటు చేశారు.

ఒక్కరోజే ఇద్ద‌రు టీడీపీ నేత‌లు వేర్వేరు కార్య‌క్రమాలు చేప‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాం శంగా మారింది.గంటా, అవంతి ప్ర‌జారాజ్యం నుంచి ఒకేసారి టీడీపీలో చేరారు.

మొన్న‌టి వ‌ర‌కూ క‌లిసి కార్య‌క్ర‌మాలు చేశారు.

ఇలా ఇద్ద‌రి మ‌ధ్య విభేదాల‌కు భీమిలి పాలిటిక్సే కార‌ణ‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

ఇటీవ‌ల అవంతికి అనుకూలంగా భీమిలిలో పోస్ట‌ర్లు వెలిశాయి.అయితే, అవంతి ప్లెక్సీల‌ను గంటా బ్యాచ్ తొల‌గించింది.

దీంతో త‌న‌కు సేఫ్ సీటుగా భావిస్తున్న‌ భీమిలిలో అడుగుపెట్టేందుకు గంటా అనుమ‌తిం చ‌కపోవ‌డంపై అవంతి శ్రీనివాస్ ఆగ్ర‌హంగా ఉన్నాడు.ఈ క్ర‌మంలోనే రైల్వే జోన్ వ్య‌వ‌హారంలో త‌న మ‌టుకు తాను సొంత అజెండాతో ముందుకు వెళ్లాడు.

రాబోయే రోజుల్లో మ‌రింత‌గా ఈ వివాదం ముద‌ర‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.మ‌రి బాబు ఎలా ప‌రిష్క‌రిస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube