భారత టెకీ “కూచీబోట్ల” హంతకుడికి...“యావజ్జీవ శిక్ష”

విదేశీయులని అమెరికా నుంచీ వెళ్ళగొడుతాను మన దేశీయులకే ఉద్యోగాలు వచ్చేలా చేస్తాను అంటూ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన నెలరోజుల లోగానే కూచీభొట్ల శ్రీనివాస్ హత్యకి గురయ్యిన సంఘటన అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.గతేడాది ఫిబ్రవరి 22న కాన్సస్‌ రాష్ట్రంలోని ఓలేత్ నగరంలో ఓ బార్‌లో ఉన్న తెలుగు టెకీలు శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్ మాడసానిపై ఆడమ్ పురింటన్ కాల్పులు జరిపాడు.

 Kansas Man Gets Life In Prison For Killing Indian Immigrant Srinivas-TeluguStop.com

‘మా దేశం నుంచి వెళ్లిపోండి’ అంటూ మొదట హెచ్చరించి బార్ నుంచి వెళ్లిపోయాడు పురింటన్.అయితే

కొద్ది సేపటి తర్వాత మళ్లీ వచ్చి వారిద్దరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి పారిపోయాడు.ఈ క్రమంలోనే శ్రీనివాస్ కూచిభొట్ల మరణించగా.అలోక్‌ తీవ్రంగా గాయపడ్డాడు దేశమంతటా నిరసనలు వెల్లువెత్తాయి.

దాంతో ఒక్క సారిగా ఉలిక్కిపడిన ట్రంప్ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ తమ ప్రజలకి ఇలాంటి శాంతి సందేశం పంపాడు.దాంతో విచారణ చేపట్టిన పోలీసులు కోర్టుకు ఆధారాలు సమర్పించిన తరువాత అమెరికా ఫెడరల్ కోర్టు తుది తీర్పును వెల్లడించింది.

జాత్యాహంకార దాడికి పాల్పడి, శ్రీనివాస్ మరణానికి కారణమయిన 52 ఏళ్ల ఆడమ్ పురింటన్‌కు కోర్టు జీవిత ఖైదును విధించింది.దీనికి అదనంగా నమోదయిన మరో రెండు హత్య కేసుల్లో దాదాపు 14ఏళ్ల జైలు శిక్షను ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది.దాంతో అమెరికాలోని భారతీయ ఎన్నారైలు ఎంతో మంది తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అయితే ఈ కేసుపై స్పందించిన శ్రీనివాస్ భార్య కోర్టు తీర్పు వల్ల తన భర్త తిరిగి రాలేడనీ, కాకపోతే జాత్యాహంకార ఘటనలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమనే హెచ్చరిక మాత్రం సమాజానికి చేరుతుందని.ఇక మీదట ఇలాంటి దాడులు జరుగకుండా అమెరికా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని ఆమె కోరారు…కేసు న్యాయమైన తీర్పు రావడానికి కృషి చేసిన డిస్ట్రిక్ట్ అటార్నీకీ, ఓలేత్ పోలీసు శాఖకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube