రాజ‌కీయాల్లోకి శ్రీరెడ్డి ? అదిరిపోతున్న ట్వీట్‌..!!

క్యాస్టింగ్ కౌచ్‌- అంటూ సినీ రంగాన్ని కుదిపేస్తున్న శ్రీరెడ్డి చుట్టూ ఇప్పుడు మీడియా ఆస‌క్తిగా ప్ర‌దక్షిణ‌లు చేస్తోంది.ఆమె ఏం చెప్పినా హాట్ న్యూస్ అయిపోతోంది.

 Sri Reddy Tweet About Ys Jagan-TeluguStop.com

ఆమె ఎలాంటి ట్వీట్ చేసినా సంచ‌ల‌నంగా మారుతోంది.గ‌త 15 రోజులుగా శ్రీరెడ్డి చుట్టూ తెలుగు మీడియా తిరుగుతూనే ఉంది.

అదేవిధంగా టాలీవుడ్ సైతం శ్రీరెడ్డి కేంద్రంగా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది.ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం తీవ్ర వివాదంలో కూరుకుపోయారు.

రాజ‌కీయంగా కూడా శ్రీరెడ్డి తీవ్ర వివాదానికి కార‌ణ‌మైంది.ఆమె వెనుక ఎవ‌రో ఉండిత‌న త‌ల్లిని తిట్టించారంటూ.

ప‌వ‌న్ చేసిన హ‌డావుడి ఇప్ప‌ట్లో తెర‌మ‌రుగ‌య్యేలా క‌నిపించ‌డం లేదు.

అంతేకాదు, ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్ కేంద్రంగా ఈ వివాదం యూట‌ర్న్ తీసుకుంది.దీంతో ఇప్పుడు శ్రీరెడ్డి తెర‌మీదికి తెచ్చిన క్యాస్టింగ్ కౌచ్‌.స‌మ‌స్య తెర‌మ‌రుగై.

ప‌వ‌న్ వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది.ఇలా శ్రీరెడ్డి వివాదం కాసింత ప‌క్క‌కు వెళ్లింద‌ని అనుకుంటున్న స‌మ‌యంలోనే ఆమె మ‌రో వివాదాన్ని తీసుకొచ్చారు.

అదికూడా విప‌క్ష నేత జ‌గ‌న్ రూపంలో ఆమె తేనెతుట్టె కుదిపారు.ఏపీలో రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసేలా శ్రీరెడ్డి తాజాగా ఓ ట్వీట్ చేశారు.

ఇప్పుడు ఇది రాజ‌కీయంగా పెను సంచ‌ల‌నం సృష్టించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించింది శ్రీరెడ్డి.

దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పైనా.జగన్‌ పైనా ప్రజల్లో విపరీతమైన అభిమానం ఉందని, ఓదార్పు యాత్ర ఒక్కటి చాలు జగన్ వ్యక్తిత్వం ఎంత మంచిదో తెలుపడానికి అంటూ ప్రశంసించింది.

అంతేకాదు.జగన్‌ని అన్నా అంటూ.

రౌడీ రాజకీయాలు చేసే వారిని వైసీపీలోకి తీసుకోవద్దని కూడా సలహా ఇచ్చింది.ఈ మేరకు ట్వీట్ చేసింది.

శ్రీరెడ్డి ట్వీట్ లో ఏం చెప్పిందంటే.‘‘జగన్ అన్నా.

రౌడీ రాజకీయాలు చేసే వాళ్లను మీలో కలుపుకోవద్దు.రాజశేఖర్ రెడ్డి గారు అన్నా.

మీరు అన్నా.జనంలో విపరీతమైన అభిమానం ఉంది.

మీరు చేసిన ఓదార్పు యాత్ర ఒక్కటి చాలు మీ మంచితనాన్ని తెలపటానికి.శాంతి, ఓర్పు, సహనం జగన్ అన్న ఆయుధాలు.

యువతకు ఆదర్శమూర్తి మన జగన్ అన్న’’ అంటూ ప్రశంసలు గుప్పించింది.

ఇప్ప‌టికే శ్రీరెడ్డి వివాదంతో త‌ల బొప్పిక‌ట్టిన టీడీపీ నేత‌ల‌కు ఇప్పుడు ఈప‌రిణామం ఎంత‌లా బాధిస్తుందో వేరేగా చెప్ప‌క్క‌ర్లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇప్ప‌టికే రాష్ట్రంలో రాజ‌కీయాలు వేడెక్కాయి.అధికార‌, విప‌క్షాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి వ‌చ్చింది.

ఈ క్ర‌మంలో రౌడీలు, రాజ‌కీయాలు అంటూ శ్రీరెడ్డి చేసిన కామెంట్లు మ‌రింత మంట పుట్టించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.మ‌రి ఏం జ‌రుగుతుందో.

అధికార టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube