శివాలయాల్లోనే ఎక్కువ‌గా న‌వ‌గ్రహాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?

బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహ‌స్పతి, శ‌ని, రాహువు, కేతువు, సూర్యుడు, చంద్రుడు ఈ తొమ్మిదింటిని నవగ్రహాలు అని అంటారు.జ్యోతిష్యులు ఈ నవగ్రహాల ఆధారంగానే జాతకాలు చెప్పుతూ ఉంటారు.

 Why Navagraha Idols Present In Sivalayam, Navagraha Idols , Sivalayam, Pooja , H-TeluguStop.com

గృహ స్థితిని బట్టి కొంతమందికి పరిహారాలు చెప్పుతూ ఉంటారు.ఆయా పరిహారాలు ఆయా గ్రహాన్ని బట్టి ఉంటాయి.

అయితే నవగ్రహాలు మనకు ఎక్కువగా శివాలయాల్లోనే కనిపిస్తాయి.దానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

న‌వ‌ గ్రహాల‌లో ఒక్కో గ్ర‌హానికి ఒక్కో అధిష్టాన దేవ‌త ఉంటుంది.శివుడు ఆ దేవతలను నియమించారు.

అలాగే గ్రహాలకు మూలం అయినా సూర్య దేవునికి కూడా ఆదిదేవుడుశివుడే.అందువల్ల గ్రహాలు అన్ని శివుని ఆదేశాల మేరకు సంచరిస్తూ ఉంటాయి.అందుకే ఎక్కువగా నవగ్రహాలు శివాలయాల్లో కనపడుతూ ఉంటాయి.

Telugu Hindus, Lord Shiva, Navagraha Idols, Pooja, Sivalayam, Surya Bhagavan-Tel

మన పురాణాల ప్రకారం పరమశివుని అను గ్రహం ఉంటే నవగ్రహాలు మన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు.అందుకే చాలా మంది భక్తులు శివాలయంలోకి వెళ్ళినప్పుడు నవగ్రహాల దగ్గరకు వెళ్లకపోయినా, శివునికి అభిషేకం చేయిస్తారు.ఆ దేవదేవుని అనుగ్రహం ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవని భక్తుల నమ్మకం.

అలాగే నవగ్రహాల ప్రభావం కూడా ఉండదని భక్తులకు అపారమైన నమ్మకం.అయితే ఈ మధ్య కాలంలో ఇతర ఆలయాలలో కూడా నవగ్రహ మండపాలను నిర్మిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube