చర్మ సంరక్షణలో క్యారెట్ ఫేస్ ప్యాక్స్..

క్యారెట్ లో బీటా- కెరోటిన్, ఖనిజలవణాలు, ఇతర విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.ఇవి మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాకుండా చర్మ సౌందర్యంలోనూ కీలకమైన పాత్రను పోషిస్తాయి.

 Carrot Face Packs For Skin Protection And Skin Beauty Details, Carrot Face Packs-TeluguStop.com

చర్మానికి సంబంధించి అన్ని రకాల సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుంది.వాటి కోసం క్యారెట్ ని ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం.

క్యారెట్ తురుముతో తేనే కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని తడి టవల్ తో తుడుచుకోవాలి.ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చర్మం కాంతివంతంగా మృదువుగా మారిపోతుంది.

రెండు స్పూన్ల క్యారెట్ రసంలో ఒక స్పూన్ కీరా దోశ పేస్ట్, ఒక పుల్లని పెరుగు కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత సాధారణమైన నీటితో కడగాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

ఇది యాంటీ ఏజింగ్ మాస్క్ గా ఉపయోగపడుతుంది.

రెండు స్పూన్ల శనగపిండిలో ఒక స్పూన్ మజ్జిగ, మూడు స్పూన్ల క్యారెట్ జ్యుస్, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయటం వలన చర్మంపై జిడ్డు తొలగిపోతుంది.

ఒక స్పూన్ క్యారెట్ జ్యుస్ లో ఒక స్పూన్ గుడ్డు తెల్లసొన, ఒక స్పూన్ పెరుగు కలిపి ముఖానికి పట్టించి పావుగంట అయ్యాక చాలాల్ని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయటం వలన ముఖం మీద ట్యాన్ తొలగిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube