మొటిమలు మచ్చలు తగ్గటానికి పసుపు ఫేస్ పాక్స్

పసుపును సాధారణంగా వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం.కానీ పసుపులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

 Turmeric Face Pack To Reduce Acne Scars, Telugu Health, Telugu Health Tips, Turm-TeluguStop.com

పసుపులో క్రిమినాశక లక్షణాలు ఉండుట వలన ఆరోగ్యపరంగా మరియు అందం సంరక్షణలోనూ సమర్ధవంతంగా పనిచేస్తుంది.ముఖ్యంగా జిడ్డు చర్మం గల వారిలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

అయితే పసుపును ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

పసుపులో క్రిమినాశక కారకాలు మరియు మంటను తగ్గించే లక్షణాలు ఉండుట వలన మొటిమలు తగ్గటమే కాకుండా మొటిమల మచ్చలు కూడా తగ్గుతాయి.

ఇప్పుడు పేస్ ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలి.వాటికీ ఏమి అవసరం అవుతాయో వివరంగా తెలుస్కుందాం.

కావలసిన పదార్ధాలు… శనగపిండి, పసుపు, పెరుగు. శనగపిండి చర్మంలో మృత కణాలను తొలగించటానికి సహాయపడుతుంది.

పసుపు క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉండి బాక్టీరియాను నాశనంచేయడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది.పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం మొటిమల కారణంగా వచ్చే మచ్చలను తగ్గిస్తుంది.

Telugu Curd, Oily Skin, Reduce Pimples, Reduce Scars, Telugu, Telugu Tips, Turme

ఒక బౌల్ లో శనగపిండి, పసుపు, పెరుగు వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత సాధారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మొటిమలు తగ్గటమే కాకుండా మొటిమల మచ్చలు కూడా మాయం అవుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube