చింతలపూడిలో టీడీపీకి ఎదురులేదు... సీటు మ‌ళ్లీ పీత‌ల‌దే

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీలో ఎంతో మంది నాయకులు ఉన్నారు.కొంతమంది నాయ‌కులు త‌మ‌ స్వార్ధానికి పార్టీలో చేరితే మరి కొంతమంది పార్టీ మీద అభిమానంతో, చంద్రబాబు మీద ఉన్న నమ్మకంతో ఎన్ని ఆఫ‌ర్లు వ‌చ్చినా పార్టీ మాత్రం మార‌లేదు.

 Tdp Will Clean Sweep In Chintalapudi On 2019 Elections-TeluguStop.com

పార్టీ సీటు ఇచ్చినా ఇవ్వ‌క‌పోయినా పార్టీనే న‌మ్ముకుని ఉంటుంటారు.అంతేకాదు అందుకు తగ్గట్టుగానే పార్టీ ని ఎప్పటికప్పుడు తమతమ స్థాయిలలో కాపాడుకుంటూ వచ్చారు.

అధినేత పై ఉండే గౌరవంతో తెలుగుదేశం పార్టీలో ఉన్న‌ప్ప‌టి నుంచీ ఇప్పటి వరకూ మరో పార్టీ వైపు కన్నెత్తి చూడకుండా ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు.అలాంటి వారు కోరుకునేది పదవులు కాదు పార్టీ మనుగడ.

పార్టీ భవిష్యత్తు ,గెలుపు.అలాంటి వారికి చంద్రబాబు ఎప్పుడు ఉన్నతమైన స్థానం కల్పిస్తూ వచ్చారు.

కొన్ని సందర్భాలలో పార్టీ కోసం కొన్ని సమీకరణాల కోసం పదవులు త్యాగం చేయాలని చంద్రబాబు చెప్పినా సంతోషంగా అధినేత మాటకి కట్టుబడిన నేతలు ఉన్నారు.అలాంటి వ్యక్తిత్వం ఉన్న నేతల్లో మాజీ మంత్రి పీతల సుజాత ఒకరు.

టీడీపీ ఆవిర్భ‌వించిన‌ప్ప‌టి నుంచి పీత‌ల సుజాత ఫ్యామిలీ పార్టీలో ఎంతో క్రియాశీల‌కంగా ప‌నిచేసింది.తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించిన నాటినుంచి ఇప్పటి వరకూ కూడా చంద్రబాబుకి వీర విధేయురాలిగా ఉన్నారు పీత.పార్టీకోసం, అధినేత మాట కోసం మంత్రి పదవిని వదులుకుని వచ్చిన పీతలకి ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో అడుగ‌డుగునా అవ‌మానాలే ఎదురువుతున్నాయి.పార్టీకోసం పీతల వాటన్నిటిని భరిస్తూ ఎక్కడా పార్టీ పరువు పోకుండా తన పని తానూ చేసుకుంటూ గతంలో కంటే కూడా ఇప్పుడు గ్రామస్థాయి నుంచీ మండలస్థాయి వరకూ మెల్ల మెల్లగా నియోజకవర్గంలో పట్టు బిగిస్తూ వచ్చేశారు.

చింత‌ల‌పూడి నియోజక వర్గానికి చెందిన సొంత పార్టీలోని కొంతమంది నేతలు పీతల కి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నా సరే తానూ మాత్రం వాటిని సున్నితంగా గమనిస్తూనే.తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు.

పీతల మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకి వ్యతిరేకంగా ఉన్న సొంత పార్టీ నేతలు పీతల ఇమేజ్ కి డ్యామేజ్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి కానీ అంతకంటే ఎక్కువగా వారు పార్టీ ని డ్యామేజ్ చేశారని చెప్పడంలో సందేహం లేదు…ఎంపీ మాగంటి కి ఎమ్మెల్యే పీతలకి మధ్య వైరం పెట్టి పార్టీ పరువుని బజారుకి ఈడ్చారు.ఆ గొడవల కి నిదర్శనమే చింతలపూడి “ఏఎంసీ” స్థానం…ఈ విషయంలోనే పీతలని దోషిగా చూపించి ఓ వర్గానికి దూరం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా సరే అది సక్సెస్ అవ్వలేదు.

పీతలని నియోజక వర్గ ప్రజలకి దూరం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే పీతల ఎన్నడు వెనకడుగు వేయలేదు.చంద్రబాబు తనకి అప్పగించిన భాద్యత ప్రకారం తన నియోజక వర్గ ప్రజలకి న్యాయం చేయడంలో దూసుకుపోతున్నారు.

ప్రజలని కలవడానికి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ వారికి ఏమి కావాలో నోట్ చేసుకుని మరీ ఆ పనులని చెక చెకా చేయిస్తున్నారు.దూకుడు రాజ‌కీయాల‌కు దూరంగా త‌న‌ను ఇబ్బంది పెట్టే నాయ‌కుల‌ను ప‌క్క‌న పెట్టేస్తూ ప్రజల అభిప్రాయం తెలుసుకుంటూ, వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తూ ఆమె ముందుకు వెళుతున్నారు.

ఇక స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో ఆమెను చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించిన‌ప్పుడు కూడా ఆమె వ‌చ్చే ఎన్నిక‌ల్లో చింత‌ల‌పూడి సీటుపై హామీ ఇచ్చార‌ని తెలుస్తోంది.దీంతో 2019 ఎన్నిక‌ల్లో వ‌ర్గ రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా టీడీపీ త‌ర‌పున మ‌ళ్లీ పీత‌ల పోటీకి రెడీ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube